అవునూ.. హీరోయిన్ పునర్నవి భూపాలం తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. అయితే ఆమె బిగ్గెస్ట్ రియాలిటీ షో తెలుగు బిగ్ బాస్ మూడో సీజన్ లో సందడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆ విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. నిన్న బుధవారం రోజు తనకు ఎంగేజ్‌మెంట్ అయిందని చేతికి ఉన్న రింగ్ ఫోటో షేర్ చేస్తూ అందరికి షాక్ ఇచ్చింది పునర్నవి. దీంతో ఈ అందాల బొమ్మ పెళ్ళి చేసుకునే వ్యక్తి ఎవరు అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు నెటిజన్స్. కొద్ది సేపటి క్రితం తనకు కాబోయే భర్తని పరిచయం చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే అతని పేరు ఉద్భవ్ రఘునందన్ కాగా, అతను యాక్టర్, రైటర్, ఫిలిం మేకర్ కూడా. రేపే పునర్నవి, ఉద్భవ్‌ల పెళ్ళి జరగనుంది.
ఇదిలా ఉంటే.. పునర్నవి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షో మూడవ సీజన్లో కంటెస్టెంట్ గా వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అందులో ముఖ్యంగా ఈ షో రాహుల్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తూ అందరి నోళ్ళల్లో నానింది. బిగ్ బాస్ హౌజ్‌లో వీరి ప్రవర్తన చూస్తే బయటకు వచ్చాక తప్పక పెళ్ళి చేసుకుంటారేమో అనే అనుమానం అందరిలో కలిగింది. పలు ఇంటర్వ్యూలకు కూడా రాహుల్,పునర్నవి ఇద్దరు కలిసి హాజరు కాగా, ఆ సమయంలో వీరిని.. మీ ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ, స్నేహమా అని ప్రశ్నించారు. దానికి స్నేహమే అని సమాధానం ఇచ్చారు. అయితే ఈమె.. "పిట్టగోడ", "ఉయ్యాల జంపాల", "మళ్లీమళ్లీ ఇది రాని రోజు" వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే బిగ్ బాస్ షోతో వచ్చిన క్రేజ్ వల్ల సినిమాల్లో అవకాశాలు క్యూ కడతాయి అనుకున్నారు అంతా. కానీ అలాంటిదేమీ జరగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: