తెలుగు సినిమాల్లో ప్రస్తుతం జాతీయస్థాయిలో క్రేజ్ తెచ్చుకున్న హీరో ప్రభాస్. బాహుబలి ముందు వరకూ ఉన్న ప్రభాస్ క్రేజ్ వేరు.. ఈ సిరీస్ సినిమాల తర్వాత రేంజ్ వేరు. ప్రభాస్ సినిమాలు ఇప్పుడు హిందీలో కూడా తెరకెక్కాల్సిందే. ఏకకాలంలో ప్రభాస్ సినిమాలు దక్షిణాది భాషలతోపాటు హిందీలో నిర్మితమవుతున్నాయి. ప్రభాస్ నార్త్ ఇండియా క్రేజ్ కు బాహుబలితో తర్వాత వచ్చిన సాహో ఓ ఉదాహరణగా నిలుస్తోంది. తెలుగులో ఫ్లాప్ అయిన సాహో బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు సాధించడం విశేషం. అయితే.. తెలుగులో మరోసారి ప్రభాస్ కు షాక్ ఇచ్చింది సాహో.

ఈనెల 18న సాహోను జీతెలుగు చానెల్ ప్రీమియర్ వేసింది. సాహోను అఫిషియల్ గా భారీ రేటుతో అప్పట్లో దక్కించుకుంది. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు కూడా ఒక కారణంతో ప్రచారం చేసి సినిమాను ప్రదర్శించింది. అయితే.. ఊహించని విధంగా ఈ సినిమాకు పూర్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ప్రస్తుతం ఉన్న ప్రభాస్ క్రేజ్ కు ఈ రేటింగ్ కు అసలు సంబంధం లేదని చెప్పాలి. కేవలం 5.81 రేటింగ్ రావడం సినీ విశ్లేషకులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. దీంతో సినిమాతోపాటు టెలివిజన్ ప్రీమియర్ కూడా ఫ్లాప్ అయిందని చెప్పాలి. దీనిపై ప్రభాస్ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. ఇందుకు కారణాలను సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. సినిమాను సాయంత్రం 4:30కి ప్లే చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. ఐపీఎల్ మ్యాచ్ లు కూడా టీవీ ప్రీమియర్ పై ప్రభావం చూపిందంటున్నారు. ఇలా పూర్ టీఆర్పీ రేటింగ్స్ వచ్చిన సినిమాల్లో పవన్ కల్యాణ్.. అజ్ఞాతవాసి, బన్నీ.. సరైనోడు, మహేశ్.. స్పైడర్ కూడా ఉన్నాయి. అయితే.. వీటికంటే కూడా సాహోకు తక్కువగా 5.81 టీఆర్పీ రావడంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారని తెలుస్తోంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: