ఈ సీజన్ బిగ్ బాస్ హౌజ్ లో బెస్ట్ ఎంటర్టైనర్ గా అవినాష్ ఆకట్టుకుంటున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన అవినాష్ తన మార్క్ కామెడీతో అలరిస్తున్నాడు. అంతేకాదు హౌజ్ లో మిగతా హౌజ్ మేట్స్ తో కలిసి ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా అవినాష్ తో కలిసి అమ్మా రాజశేఖర్ చేసిన కామెడీ ఈరోజు ఎపిసోడ్ లో హైలెట్ అవనుంది.

బిగ్ బాస్ సీజన్ 4 ఎనిమిదవ వారం గురువారం ఎపిసోడ్ లో అవినాష్ తో అమ్మా రాజశేఖర్ జత కట్టి మిగతా హౌజ్ మేట్స్ ను టీజ్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ప్రతి హౌజ్ మేట్ దగ్గరకు వెళ్లడం వీరిద్దరు కలిసి కామెడీ చేయడం జరుగుతుంది. అవినాష్ హౌజ్ లో ఉండటం వల్ల టాస్కుల టైం లోనే షో సీరియస్ గా ఉంటూ మిగతా టైం లో ఎంటర్టైనింగ్ గా సాగుతుంది. ఆడియెన్స్ కూడా ఈ సీజన్ లో ఆట పాటలతో పాటుగా కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు.

అవినాష్, అమ్మా రాజశేఖర్ కలిసి చేసిన కామెడీ ఈరోజు హౌజ్ మేట్స్ నే కాదు ఆడియెన్స్ ను కూడా ఎంటర్టైన్ చేసేలా ఉంది. అమ్మా రాజశేఖర్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు మరి ఈ వారం ఆయన్ని సేవ్ చేయాలంటే ప్రేక్షకులను ఆమాత్రం ఆకట్టుకోవాల్సిందే. మరి ఈ వారం అమ్మా రాజశేఖర్ సేవ్ అవుతారా లేక హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతారా అన్నది చూడాలి.                                                                        


మరింత సమాచారం తెలుసుకోండి: