అవునూ.. రెబల్ స్టార్ ప్రభాస్ ను ఓ చిన్న హీరో దాటేశాడట. అయితే అతను ఎవరు? ఏ విషయంలో దాటేశాడు? అంత భారీ ఫాలోయింగ్ ఇంకా ఎవరికి ఉంది? ఇప్పట్లో ప్రభాస్ సినిమా కాదు కదా ఎవరి సినిమా రిలీజ్ అవ్వలేదుగా మరెలా దాటేశాడు? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. రెబల్ స్టార్ ప్రభాస్ ను దాటేసిన ఆ హీరో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయనట. అయితే అది ఏ విషయంలో అంటే టీఆర్పీ రేటింగ్ విషయంలో మాత్రమే. అయితే "సాహో" సినిమా విడుదల చాలా రోజులు అయ్యింది. కొన్ని కారణాల వల్ల బుల్లి తెరపై ప్రదర్శించలేదు. ఎట్టకేలకు జీ తెలుగులో లో ఈ సినిమా ప్రసారం అయ్యింది. భారీ రేటింగ్ ను ఛానల్ యాజమాన్యం ఆశించింది. భారీగా పబ్లిసిటీ చేయడంతో పాటు మంచి టైం చూసి ప్రసారం చేశారు. అయినా కూడా "సాహో" కు దక్కిన టీఆర్పీ రేటింగ్ 5.8 మాత్రమే. హిందీ వర్షన్ ప్రసారం అయిన సమయంలో రికార్డు స్థాయి రేటింగ్ దక్కించుకుంది. రీ టెలికాస్ట్ సమయంలో కూడా అదిరిపోయే రేటింగ్ ను దక్కించుకున్న "సాహో" సినిమా తెలుగు వర్షన్ మాత్రం పరువు పోగొట్టుకునే రేటింగ్ ను పొందింది.
ఇదిలా ఉంటే.. సమయంలో ఈటీవీలో ఆర్ఎక్స్ 100 సినిమా హీరో కార్తికేయ నటించిన "గుణ 369" సినిమా కూడా ప్రసారం అయ్యింది. అయితే అసలు విషయం ఇక్కడే ఉంది. అదేంటంటే.. ఈ సినిమా 5.9 రేటింగ్ ను రాబట్టింది. ఇది ప్రభాస్ అభిమానులకు కాస్త ఇబ్బంది కలిగించే విషయమే అయినా అదే నిజం. "సాహో" మూవీకి రేటింగ్ రానంత మాత్రాన ప్రభాస్ స్టార్ డం లేనట్లు కాదు కాని "సాహో" సినిమా ఫలితం అలాంటిది. అందుకే ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: