అవునూ.. ఇలాంటి మంచి సినిమాల్లో నన్ను ఎందుకు తీసుకోవట్లేదు అంటూ సీనియర్ హీరో జగపతి బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇంతకీ ఆయన ఇంత మెచ్చుకుంటున్న సినిమా ఏది? ఆయన ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? అనే విషయాలు ఇపుడు మన సమీక్షలో తెలుసుకుందాం రండి..
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. గురువారం తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా "కలర్ ఫొటో"పై ప్రశంసల జల్లు కురిపిస్తూనే, ఇలాంటి చక్కని సినిమాల్లో తనను ఎందుకు తీసుకోవట్లేదని ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా చూసిన జగపతి బాబు స్పందిస్తూ.. "కలర్ ఫొటో నన్ను పూర్తిగా ఇంప్రెస్ చేసింది. సూపర్ కిడ్ తన వయసుతో పోలిస్తే గొప్పగా ఈ సినిమాని తీశాడు. గుడ్ యాక్టర్ అయిన సుహాస్ హీరోగానూ ప్రూవ్ చేసుకున్నాడు. ఒక వ్యక్తిగా నేనెంతో ఇష్టపడే కాలభైరవ మ్యూజిక్‌లోని సెన్సిబిలిటీస్ నన్నెప్పుడూ ఇంప్రెస్ చేస్తుంటాయి. సినిమాని హిట్ చేసేవి డబ్బులు (బడ్జెట్‌), స్టారడమ్ మాత్రమే కాదని.. సినిమా హిట్టవడానికి కావాల్సినవి హృదయం, ఆత్మ అని మరోసారి ప్రూవ్ అయినందుకు నాకు ఆనందంగా ఉంది" అని చెప్పుకొచ్చారు. ఇంకా మాట్లాడుతూ.. "ఇలాంటి సినిమాల్లో భాగమవడాన్ని నేను గర్వంగా ఫీలవుతానని చెప్తాను. బాధాకరమైన విషయమేమంటే ఇలాంటి సినిమాలకు నన్ను తీసుకోరు.. నేను ఇలాంటివి చేయననుకుంటారో లేక నా రేటును భరించలేమనుకుంటారో.. నన్ను పరిగణనలోకి తీసుకోరు. ఆ రెండూ నిజం కావు కుర్రాళ్లూ.." అని తన బాధను వ్యక్తం చేశారు జగపతిబాబు.
ఇదిలా ఉంటే.. డెబ్యూ డైరెక్టర్ సందీప్ రాజ్ రూపొందించిన "కలర్ ఫొటో" మూవీ ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలై వీక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసల్నీ అమితంగా పొందుతోంది. "హృదయ కాలేయం", "కొబ్బరిమట్ట" చిత్రాలను తీసిన సాయిరాజేశ్ నిర్మించిన ఈ సినిమాని ఇష్టపడుతున్న వారి జాబితాలో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా చేరుతున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లో సీనియర్ యాక్టర్ జగపతిబాబు చేరారు. అయితే ఇప్పటికే ఈ సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు సుహాస్ ను, డైరెక్టర్ ను మెచ్చుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: