ప్రియాంక చోప్రా ' ది వైట్ టైగర్ ' ట్రైలర్ చూశారా?

ప్రియాంక చోప్రా తదుపరి చిత్రం 'ది వైట్ టైగర్' ట్రైలర్ బుధవారమే విడుదలైంది. రామిన్ బహ్రని దర్శకత్వంలో రాజ్ కుమార్, ఆదర్శ్ గౌరవ్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో తాను నటించడం ఎంతో ఆనందంగా ఉందని ప్రియాంక ట్వీట్ చేసింది.

అరవింద్ ఆడిగా రచించిన 'ది వైట్ టైగర్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. 2008 లో ఈ రచనకు 'మ్యాన్ బుకర్ ప్రైజ్' అవార్డ్ కూడా లభించింది. భారత్ దేశంలోని సామాజిక సమస్యలైన పేదరికం, అవినీతి, జీవన పోరాటం వంటి వాటిపై ఈ చిత్రం వ్యంగ్యాస్త్రాల్ని సంధించింది.

ఒక నిరుపేద గ్రామస్థుడు(ఆదర్శ్) గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగిన తీరు ట్రైలర్ లో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నదీ కథలో వివరించారు.  అమెరికా నుంచి వచ్చిన ఇద్దరు యువ దంపతుల(రాజ్ కుమార్, ప్రియాంక) వద్ద ఆదర్శ్ కార్ డ్రైవర్ గా చేరతాడు. ఈ నేపథ్యంలో అతని జీవితంలో ఎలాంటి సంఘర్షణలు ఎదురైంది? అనే విషయాలు కథలో కీలకంగా ఉన్నాయి.

ఈ చిత్రం ట్రైలర్ ని ప్రియాంక పోస్ట్ చేస్తూ ఇలా రాసింది. " నువు ఆటంకాల్ని చీల్చుకుంటూ రానంతవరకు నీకు ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఈ చిత్రంలో చేయడం నాకు అందంగా ఉంది. డిసెంబర్ లో థియేటర్లలో ఈ సినిమా విడుదల అవుతుంది. జనవరిలో నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ ప్రసారమవుతుంది"                                
           

మరింత సమాచారం తెలుసుకోండి: