పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. దిల్ రాజు నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి  వేణు శ్రీరామ్సినిమా కి దర్శకుడు.. గతంలో ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా పరిచయమైన వేణు ఆతర్వాత రవితేజ తో ఓ సినిమా ప్లాన్ చేసినా అది వర్క్ అవుట్ కాలేదు.. దాంతో కొంత టైం తీసుకుని బాలీవుడ్ లోని పింక్ సినిమా తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. అయితే ఈ కథను పవన్ కళ్యాణ్ చేయడం విశేషం..తెలుగు నేటివిటి కి తగ్గట్లు, పవన్ కళ్యాణ్ హీరోయిజానికి తగ్గ మార్పులు చేసి ఈ సినిమా ని ఇక్కడ చేస్తున్నారు... ఇటీవలే సినిమా కు సంబంధించి ఓ పాట, మోషన్ పోస్టర్ రిలీజ్ కాగ, పవన్ ఫాన్స్ వాటిని ఎంతగా ఆదరించారో అందరికి తెలిసిందే..

ఇక సినిమా రిలీజ్ పై కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఒకసారి ఈ సినిమా OTT రిలీజ్ ఆవుతుందని చెప్తున్నారు మరోసారి దియేటర్లలో అంటున్నారు.. దేనిపై క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు.. అయితే ఇటీవలే దియేటర్లలో మాత్రమే ఈ సినిమా ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పటికే అరణ్య, క్రాక్, రెడ్, రంగ్ దే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ డేట్ చెప్పకపోయినా సంక్రాంతి విడుదల అని తమ ప్రమోషన్ లో చెప్పేసుకున్నాయి. తేదీలు మాత్రమే ఖరారు చేయలేదు. ఈ ఐదు సినిమాలకే థియేటర్లు దాదాపు లాక్ అయిపోతాయి. ఒకవేళ అప్పటికీ యాభై శాతం ఆక్యుపెన్సీనే ఉంటే రెండు మూడు డ్రాప్ అయ్యే ఛాన్స్ లేదు.

అలా కాకుండా వీటి మధ్యలో వకీల్ సాబ్ వస్తే స్క్రీన్లు సరిపోక డిస్ట్రిబ్యూటర్లు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అసలే జనం ఇంతకుముందులా హౌస్ ఫుల్ చేసే స్థాయిలో వస్తారో రారో అనే అనుమానాలు ఇంకా ట్రేడ్ లో వ్యక్తమవుతూనే ఉన్నాయి. అలాంటప్పుడు ఇన్నేసి సినిమాలు పోటీకి దింపితే ఖచ్చితంగా ఒకదాని మీద మరొక సినిమా ప్రభావం పడి కలెక్షన్లను పంచుకోవాల్సి ఉంటుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్సినిమా తర్వాత  క్రిష్ దర్శకత్వంలో పిరియాడికల్ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా ఇందులోనే సాగర్ చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: