ఇటీవలే సౌత్ నుంచి బాలీవుడ్ కి వెళ్ళే సినిమా లు లిస్టు కాస్త ఎక్కువ అవుతుందని చెప్పాలి.. సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడంతో పాటు హిట్స్ కూడా కొడుతుండడంతో బాలీవుడ్ హీరోలు అందరు సౌత్ సినిమా ల్పి ఓ కన్నేసి ఉంచుతున్నారు.. తమ బాడీ లాంగ్వేజ్ లకు పలానా సినిమా సూట్ అవుతుందంటే చాలు వెంటనే ఆ సినిమా ని సొంతం చేసుకుంటున్నారు.. బాలీవుడ్ లో తమ మార్కెట్ కు తగ్గట్లు గా మార్చుకుని హిట్స్ కొట్టి సేఫ్ గా ఉంటున్నారు.. ఇప్పటికే సౌత్ నుంచి వస్తున్న అన్ని సినిమా లు బాలీవుడ్ లో రీమేక్ లు అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో తాజాగా మరో సినిమా పై కన్నేసింది బాలీవుడ్..

సూర్య నటిస్తున్న ఆకాశం నీ హద్దురా సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది.. నవంబర్ 1 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవతున్న ఈ సినిమా స్టొరీ కాస్త బాలీవుడ్ కి రిలేటెడ్ గా ఉందట.. అందుకే బాలీవుడ్ మేకర్స్ ఈ సినిమా రెస్పాన్స్  ఎలా ఉంటుందో అని చూస్తున్నారు.. ఈ సినిమా లో సౌత్ స్టార్ సూర్య హీరో కాగ సూర్య గత కొద్ది సినిమాలుగా మంచి సినిమాలు చేయట్లేడనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..  అయితే అయన ఆశలు అన్ని ఆకాశం నీ హద్దురా అనే సినిమాపైనే పెట్టుకున్నాడు..గురు లాంటి మంచి క్లాసిక్ హిట్ తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై మంచి అభిప్రాయాలూ ఉన్నాయి..  ఇక ఇదిగో అదిగో అంటూ జరుపుతుండడం తో ప్రేక్షకుల్లో ఈ సినిమా ఫై ఆసక్తి కూడా తగ్గుతూ వస్తుంది. దాంతో సినిమా రిలీజ్ డేట్ ని ఇటీవలే ప్రకటించారు..

ఒక సామాన్య పైలెట్ ఒక ఎయిర్ కంపెనీని ఎలా ప్రారంభించాడు.. సామాన్యులకు ఎలా విమాన ప్రయాణంను చేరువ చేశాడు అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఈ కథ ఉందని.. తప్పకుండా హిందీలో రీమేక్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ విడుదల కాకుండానే రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. సినిమా విడుదలైన వెంటనే రీమేక్ పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ యావరేజ్ టాక్ వచ్చినా కూడా హిందీ రీమేక్ పనులు మొదలు అవ్వనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: