కొణిదెల ఫ్యామిలీ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇటీవల క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన రంగస్థలం సినిమా తో భారీ సక్సెస్ ని అందుకున్న చరణ్ ఆ పై బోయపాటి శీను దర్శకత్వంలో నటించిన సినిమా వినయ విధేయ రామ. అయితే మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బోల్తా కొట్టింది. దాంతో ప్రస్తుతం నటిస్తున్న ఆర్ఆర్ఆర్ పై బాగా దృష్టి పెట్టారు చరణ్.

ఇక ఓ వైపు హీరోగా చేస్తూ మరోవైపు ఖైదీ నెంబర్ 150 సినిమా తో నిర్మాతగా మారిన చరణ్ వరుసగా తన తండ్రితో సినిమాలు నిర్మిస్తూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక అతి త్వరలో వివి వినాయక్ దర్శకత్వంలో ఇటీవల మలయాళంలో తెరకెక్కి భారీ హిట్ ను సొంతం చేసుకున్న లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ ని కూడా నిర్మించనున్నారు రామ్ చరణ్. ఈ సినిమాలో మెగాస్టార్ హీరోగా నటించనుండగా ఒక స్టార్ హీరోయిన్ ఆయనకు జోడి గా నటించనున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటివరకు వరుసగా తండ్రితో సినిమాలు నిర్మిస్తూ కొనసాగుతున్న రాంచరణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు సినిమా చేస్తారు అంటూ కొన్ని రోజుల నుండి పలువురు ఆయన అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ విషయమై కొన్ని ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి కొన్నాళ్ల నుంచి బాబాయ్ పవర్ స్టార్ తో సినిమా చేసేందుకు చరణ్ కూడా ఎంతో ఆశగా ఉన్నారని అయితే ఇప్పటివరకూ తాము ఆశించే విధంగా ఎటువంటి స్క్రిప్టు దొరకలేదని సమాచారం. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బాబాయ్ తో సినిమా చేస్తానని అలానే ఆ సినిమా రికార్డులని బద్దలు కొట్టే టాప్ స్థాయిలో నిలిచేలా నిర్మిస్తానని కూడా చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో చరణ్ పవర్ స్టార్ తో సినిమా ఎప్పుడు నిర్మిస్తారో తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి అని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: