ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మరో నటుడు రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ని పూర్తి చేసుకోగా దీనిని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. కాగా ఇందులో ఎన్టీఆర్ కొమరం భీం గా అలానే రాంచరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన కొమరం భీం ఫస్ట్ లుక్ టీజర్ అలాగే అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ టీజర్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాపై అవి భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. కాగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ కనబడుతోంది. ఇకపోతే దీని తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ సంస్థలు కలిసి నిర్మించనున్న సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాగా మరోవైపు త్రివిక్రమ్సినిమా కథను ఎంతో పకడ్బందీగా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే గతంలో త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ తీసిన అరవింద సమేత సినిమా మంచి సక్సెస్ సాధించినప్పటికీ అందులో తాము ఆశించిన రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ అంశాలు లేవని కొందరు ఎన్టీఆర్ అభిమానులు నిరాశ వ్యక్తం చేసారు. అయితే ఈసారి మాత్రం త్రివిక్రమ్ తో తాను చేయబోయే సినిమాలో పక్కాగా ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా ఉండేలా మరింత జాగ్రత్తగా వహిస్తున్నారట ఎన్టీఆర్. అలానే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ స్క్రిప్ట్ తయారవుతుందని, రేపు రిలీజ్ తర్వాత పక్కాగా ఈ సినిమా హిట్ ఖాయం అని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే ఇది నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గొప్ప పండుగ వార్త అని చెప్పకతప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: