మహానటి సినిమాతో అత్యద్భుత విజయాన్ని అందుకున్న కీర్తి సురేష్ ఆ సినిమాలో తన ఆకట్టుకునే నటనతో ఏకంగా కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారమైన జాతీయ ఉత్తమ నటిగా అవార్డును అందుకోవడం జరిగింది. మొదటగా తెలుగులో నేను శైలజ సినిమా ద్వారా హీరోయిన్ గా అడుగుపెట్టిన కీర్తి సురేష్ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆపై నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన నేనులోకల్ సినిమాలో కూడా హీరోయిన్ నటించిన కీర్తి దానిద్వారా కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే దాని అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఆమెకు అజ్ఞాతవాసి సినిమాలో అవకాశం రావడం జరిగింది. కానీ ఆ సినిమా మాత్రం రిలీజ్ అనంతరం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఆపై ఆమె నటించిన సినిమా మహానటి మొత్తానికి భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ఆమెకు మంచి పేరును కూడా తెచ్చిపెట్టింది. ఇక అక్కడి నుండి వరుసగా అవకాశాలతో దూసుకుపోతోంది కీర్తి. ఇక ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు సినిమాలు చేసుకుంటూ కొనసాగుతున్న కీర్తి సురేష్ ఇటీవల పెంగ్విన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన రేంజ్ సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాలైన గుడ్ లక్ సఖి, మిస్ ఇండియా త్వరలో రిలీజ్ కానున్నాయి. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ ఎస్ కోనేరు నిర్మాతగా నరేంద్రనాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్ ఇండియా సినిమా ట్రైలర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి స్పందన దక్కించుకోవడంతో పాటు సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు కూడా క్రియేట్ చేయడం జరిగింది.

ఇకపోతే ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో కీర్తి సురేష్ మన భారతీయ సంప్రదాయ పానీయం అయినటువంటి టీ ని విదేశాలకు తీసుకువెళ్లి తనదైన రీతిలో అద్భుతమైన రీతిలో తయారు చేసి దానిని అమ్మే అమ్మాయి గా, ఆపై ఆ బిజినెస్ లో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదుగుతూ గొప్ప పేరు ప్రఖ్యాతులు అందుకుంటుందని తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. పెంగ్విన్ తో అభిమానులని కొంత నిరాశ పరిచిన కీర్తిసురేష్ ఎలాగైనా సరే ఈ మిస్ ఇండియా సినిమా ద్వారా భారీ హిట్ కొట్టి వారిని ఖుషి చేయాలని చూస్తున్నారు. మరి ఆమె ఆశిస్తున్నట్టు గా ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొద్ది రోజుల వరకు వెయిట్ చేయక తప్పదు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: