ఆ తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర లో నటించే ఛాన్స్ కొట్టేసిన కాజల్ ఆ సినిమా సంచలన విజయం తర్వాత స్టార్ హీరోయిన్ గా గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించారు. ఇక అక్కడి నుండి వరుసగా తెలుగు తో పాటు పలు ఇతర భాషల్లో కూడా ఛాన్స్ లు అందుకున్న కాజల్ వాటిని మంచి సక్సెస్ లుగా మలచుకుని మరింతగా క్రేజ్ ని, పాపులారిటీని అందిపుచ్చుకున్నారు. ఇక కాజల్ తర్వాత టాలీవుడ్ లో అనుష్క వివాహం జరగనుందనే వార్త ఒకటి కొద్దిరోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది.
వాస్తవానికి కొన్నాళ్ల నుండి అనుష్క కుటుంబ సభ్యులు ఆమెకు పలు సంబంధాలు వెతుకుతున్నారని అయితే ఇప్పటి వరకు ఆమెకు ఏ సంబంధం సెట్ కాలేదని కానీ రాబోయే మరికొద్ది రోజుల్లో మంచి అబ్బాయిని వెతికి ఆమెకు జతకట్టాలని చూస్తున్నారట కుటుంబ సభ్యులు. మరోవైపు అనుష్క కూడా ప్రస్తుతం ఏ సినిమా కూడా ఓకే చేయకపోవడంతో ఆమె అతి త్వరలో వివాహం చేసుకున్నట్టు వస్తున్న వార్తలకు ఇది బలాన్నిస్తోంది అని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త ప్రకారం కాజల్ తర్వాత అతి త్వరలో అనుష్క వివాహం నిజంగానే చేసుకుంటారా లేక సినిమా ల్లోనే కొనసాగుతారా అనే విషయమై పూర్తి వాస్తవాలు వెల్లడి కావాలంటే స్వయంగా ఆమె దీని పై ప్రకటన చేయాలని అంటున్నారు విశ్లేషకులు....!!