బిగ్ బాస్ సీజన్ 4 నుండి అనారోగ్య సమస్యలతో మరో కంటెస్టంట్ నోయెల్ హౌజ్ నుండి బయటకు వచ్చారు. మొదట్లో కొద్దిగా దూకుడు చూపించిన నోయెల్ ఎందుకో ఈమధ్య కొన్ని వారాలుగా హౌజ్ లో ఉంటున్నా సరే సరైన ఆట ఆడట్లేదు. కొద్దిరోజులుగా కాలు నొప్పితో బాధపడుతున్న నోయెల్ ఈమధ్య సోల్డర్ పెయిన్ అంటున్నాడు. అయితే ఈ వారం అతను మరింత సిక్ అవడం.. టాస్కులు ఏమి ఆడకపోవడంతో అతన్ని హౌజ్ నుండి బయటకు పంపించారు.

అయితే బిగ్ బాస్ చెప్పిన దాని ప్రకారం చూస్తే వారే స్పెషలిస్టులతో ట్రీట్ మెంట్ చేయిస్తారని తెలుస్తుంది. కోలుకునే తిరిగి మళ్లీ హౌజ్ లోకి పంపిస్తారని తెలుస్తుంది. మరి నోయెల్ మళ్ళీ హౌజ్ లోకి వస్తాడా రాడా అన్నది చెప్పడం కష్టం. ఇదిలాఉంటే ఈ వారం నామినేషన్స్ నుండి ఒకరు బయటకు వస్తే ఉన్న 11 మందిలో నోయెల్ బయటకు రాగా 10 మంది ఉంటారు. అందులో ఒకరు ఎలిమినేట్ అయితే 9 మంది మాత్రమే హౌజ్ లో ఉంటారు.

రాను రాను టాస్కులు టఫ్ గా అవుతున్న తరుణంలో ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తుంది. హౌజ్ మేట్స్ కూడా ఆట మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. సో మరో రెండు వారాలు అయితే టాప్ 5.. టాప్ 3 పర్ఫెక్ట్ లెక్కలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. మొత్తానికి నోయెల్ ఎగ్జిట్ తో టాప్ ప్లేసులు మారే అవకాశం ఉంది.                                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: