డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత పూరీ ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. పూరీ వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేయాలని చూస్తున్నాడు. అందులో మొదటిది జనగణమన. సూపర్ స్టార్ మహేష్ తో హ్యాట్రిక్ మూవీగా జనగణమన వస్తుందని అనుకున్నారు. పూరీ కూడా మహేష్ కోసమే ఈ కథ అని చెప్పాడు.

అప్పట్లో ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్స్ కూడా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పూరీ, మహేష్ ల మధ్య దూరం పెరగడం.. ఇప్పుడు మహేష్ తో కాకుండా పూరీ జనగణమన వేరే హీరోతో చేయాలనుకోవడం జరుగుతుంది. ఆమధ్య తన నెక్స్ట్ సినిమా జనగణమన అంటూ చెప్పుకొచ్చిన పూరీ అది మహేష్ తోనా కాదా అన్నది మాత్రం చెప్పలేదు.

జనగణమన పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని పూరీ ప్లాన్. సబ్జెక్ట్ కూడా అదే విధంగా రాసుకున్నాడు. అయితే పూరీ ఆ సినిమాను మహేష్ తో చేసే అవకాశం లేదని అంటున్నారు. మహేష్ వరుసగా క్రేజీ సినిమాలు చేస్తున్నాడు పరశురాం తర్వాత త్రివిక్రం ఆ తర్వాత రాజమౌళి సినిమాలు ఉన్నాయి. కాబట్టి పూరీ జనగణమన మహేష్ కాకుండా వేరే హీరో అని ఫిక్స్ అవ్వాల్సిందే. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు అందుకుంటారో చూడాలి. ఒకవేళ మహేష్ కోసమే అయితే మాత్రం మరో రెండు మూడేళ్లు తప్పకుండా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి పూరీతో జనగణమన మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.                                                           
  

మరింత సమాచారం తెలుసుకోండి: