రెండు దశాబ్దాల క్రితం నుంచీ తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అభిమానులు కూడా రజినీ రాజకీయాల్లోకి రావాలనే ఇప్పటికీ కోరుకుంటున్నారు. అయితే.. ఆయన ఎప్పుడూ ఈ అంశంపై స్పందించలేదు. తమిళనాడు రాజకీయాల్లో జయలలిత, కరుణానిధి శకం ముగియడంతో రాజకీయ శూన్యత ఏర్పడిందని.. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఆమధ్య ప్రకటించారు. అయితే.. రజినీ రాజకీయ ఎంట్రీపై ప్రస్తతం ఓ వార్త వైరల్ అయింది. ఆనారోగ్య సమస్యలతో రజినీ రాజకీయాల్లోకి రావడం లేదనేది ఆ లెటర్ సారాంశం. దీనిపై రజినీకాంత్ స్పందించారు.

‘నేను రాసినట్టుగా ఓ లెటర్ వైరల్ అయింది. ఆ లెటర్ కు నాకు సంబంధం లేదు. అయితే.. అందులో ప్రస్తావించిన నా ఆరోగ్యం, డాక్టర్ల సూచనల విషయంలో కొంత నిజం ఉంది. నా రాజకీయ ఎంట్రీపై అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాను. సరైన సమయంలో నేను దీనిపై స్పందించి నా నిర్ణయం తెలియజేస్తాను’ అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో రజినీకాంత్ విడుదల చేసారంటూ వైరల్ అయిన ఆ లెటర్ ఫేక్ అని తేలిపోయింది. నిజానికి ఆ లెటర్ లో.. ‘ప్రస్తుతం కరోనా సమయంలో నేను ఎక్కువగా బయటకు వెళ్లకూడదని డాక్టర్లు చెప్తున్నారు’.


‘నాకు కిడ్నీ మార్పిడి జరిగింది. కరోనా సమయంలో పబ్లిక్ మీటింగ్స్ మంచిది కాదు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నా రాజకీయ ఎంట్రీపై డిసెంబర్ లో నిర్ణయం తెలియజేస్తాను. నేను ప్రాణం కోసం భయపడను. కానీ.. ప్రజల నిర్ణయం మేరకే నడుచుకుంటాను. అదే దైవ నిర్ణయం. జై హింద్’ అని రాసివున్న లెటర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో ఫ్యాన్స్ లో ఆందోళన నెలకొంది. దీనిపైనే రజినీ క్లారిటీ ఇచ్చి గాసిప్స్ కు ఫుల్ స్టాప్ పెట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: