ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ న్యూస్ చదవండి.. రానా పెళ్లి చేసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక రానా భార్య మిహికా ఎప్పటి నుండో అతనికి  స్నేహితురాలిగా కొనసాగుతున్నా, వీరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నా మీడియాకు మాత్రం సమాచారం లేదు. అసలు ఇంత వరకు చిన్న లీక్ కూడా లేకుండా పెద్ద బాంబ్ లాంటి వార్త బయటికి వచ్చింది. ఐతే గతంలో రానా దగ్గుబాటి అనేక మంది హీరోయిన్స్ తో అఫైర్స్ నడిపారని వార్తలు వచ్చాయి. రానా ప్రేమాయణం సాగించారంటూ వచ్చిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం…

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన శ్రీయా శరణ్ 2016లో రానాతో అనేక సందర్భాలలో కనిపించారు. వీరు నైట్ డిన్నర్ లో సన్నిహితంగా దిగిన ఫోటోలు కూడా బయటికి రావడంతో వీరి మధ్య ఎదో నడుస్తుందని అప్పట్లో మీడియాలో కథనాలు రావడం జరిగింది. ఐతే శ్రీయా వీటిని కొట్టిపారేసింది, ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన రానా, నేను మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పి, రూమర్స్ కి చెక్ పెట్టింది.

2017లో సింగర్ సుచిత్ర అకౌంట్ ద్వారా సుచి లీక్స్ పేరున విడుదలైన కొందరు తారల ప్రైవేట్ ఫోటోలు కోలీవుడ్ లో ప్రకంపనలు రేపాయి. వాటిలో రానా మరియు త్రిషా సన్నిహితంగా ఉన్న ఫోటో కూడా ఉంది. అప్పటికే త్రిషా, రానా మధ్య అఫైర్ నడుస్తోందన్న పుకారు ఉండగా ఆ లీక్డ్ ఫోటో తర్వాత మరింత బలపడింది. ఐతే త్రిష, రానా మేము స్నేహితులం మాత్రమే అని చెప్పుకున్నారు.

2010లో లీడర్ సినిమాతో వెండితెరకు పరిచమైన రానా దగ్గుబాటి రెండో చిత్రంతోనే హిందీలో ఎంట్రీ ఇచ్చారు. అభిషేక్ బచ్చన్, బిపాసా బసు ప్రధాన పాత్రలలో 2011లో వచ్చిన దమ్ మారో దమ్ చిత్రంలో రానా ఓ కీలక రోల్ చేశారు. ఈ సినిమా సమయంలో బిపాసా బసుతో రానా ప్రేమాయణం నడిపాడని టాక్. అప్పటికే బిపాసా బసు జాన్ అబ్రహం తో బ్రేకప్ అయి ఉంది. ఈ ఆవార్తలను కూడా బిపాసా, రానా ఖండించారు.

బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తో కూడా రానాకు అఫైర్ ఉందని వార్తలు వచ్చాయి. వీరు ప్రయివేట్ పార్టీలలో సన్నిహితంగా కనిపించడంతో ఈ వార్తలు వచ్చాయి. రానా నాకు మంచి స్నేహితుడు మాత్రమే, ఎందుకంటే ఆయన అప్పటికే ఒకరితో ప్రేమలో ఉన్నాడు అని తనదైన శైలిలో ఆమె చెక్ పెట్టింది. మరి అప్పుడు రకుల్ చెప్పిన రానా ప్రేయసి మిహికా నేనా లేకా ఇంకెవరైనా ఉన్నారా? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: