టాలీవుడ్ లో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఒకప్పుడు సినిమాలలో తళుక్కుమన్న హీరోయిన్లు ఇప్పుడు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. తన స్నేహితులను పెళ్లి చేసుకోబోతున్నారు.. అది కూడా చాలా కాలం వారితో డేటింగ్ లో ఉంటూ చివరికి పెళ్లికి రెడీ అవుతున్నారు. నిన్న కాజల్ అగర్వాల్ పెళ్లికి రెడీ అయ్యింది. ఈరోజు ఓ ఇంటిది కాబోతోంది. ఇప్పుడు మరో హీరోయిన్ అదే దారిలో నడవనుంది. ఆమె ఎవరో కాదు పూనమ్ భజ్వా.. కూల్ గా కనిపించే ఈ అమ్మడు తెలుగులో రెండు మూడు సినిమాలలో నటించింది. 



కాగా , మొదటి సినిమా తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన బబ్లీ బ్యూటీ పూనమ్‌ బాజ్వా తక్కువ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పరుగు, బాస్‌ చిత్రాల్లో నటనతో మెప్పించినా ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో తమిళం, మలయాళంలో కొన్ని చిత్రాలు చేసి అక్కడా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినిమా అవకాశాలు లేకపోవడంతో పెళ్లికి రెడీ అయ్యింది..35 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్‌‌గానే ఉన్న ఈ అమ్మడు బ్యాచిలర్ లైఫ్‌కి పెళ్లితో శుభం కార్డు వేసింది. 



మొత్తానికి సోషల్ మీడియా ద్వారా తన బాయ్ ఫ్రెండ్ ను ప్రజలకు చూపించింది.సునీల్‌ రెడ్డి, మై రూట్స్‌, గ్రౌండ్‌, హ్యండ్సమ్‌, మంచి మనసున్న నా లైఫ్‌ మేట్‌, సోల్‌మేట్‌కు హ్యాపీ బర్త్‌డే. నీతో ఉండే ప్రతీ క్షణం ఓ మ్యాజిక్‌లా అనిపిస్తుంది.. హ్యాపీ బర్త్‌ డే అంటూ తన ప్రియుడిపై తనకున్న ప్రేమను అభిమానులతో పంచుకుంది. సోల్ మేట్ అంటూ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. ఆ పోస్ట్ తో పాటుగా ఫోటోలను కూడా జత చేసింది. ప్రస్తుతం ఇవి షేర్లు లైకుల తో ట్రెండ్ అవుతున్నాయి. అలనాటి తారలు అందరూ ఇప్పుడు పెళ్లి మీద మనసు పడేసుకున్నారు.. ఇక నెక్స్ట్ ఏ హీరోయిన్ పెళ్లి చేసుకుంటుందో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి: