బిగ్ బాస్ సీజన్ 4 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.. ఎనిమిదో వారం ఎలిమినేషన్ కు రెడీ అయింది. ఇకపోతే ఈ వారం ఇంట్లో ఉన్న సభ్యులలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు అనేది ఆసక్తిగా మారింది. అయితే అరియనా గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. చిన్న చిన్న ఇంటర్వ్యూస్ చేసుకుంటూ యుట్యూబ్ ద్వారా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ఈ బ్యూటీ టాప్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లో కంటెస్టెంట్‌గా సత్తా చూపిస్తోందంటే  దానికి వర్మే కారణం అంటుంది అదేంటో ఇప్పుడు చూద్దాం..



అరియానా బిగ్ బాస్ షో కు రాకముందు యుట్యూబ్ ఛానెల్స్ లో చిన్న చిన్న ఇంటర్వ్యూస్ చేసుకుంటూ ఫేమస్ అయ్యింది.అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు వివాదాస్పద దర్శకుడు వర్మ ఇంటర్వ్యూ మాత్రం ఆమె రేంజ్ ను పూర్తిగా మార్చేసింది.. అంటే ఈ అమ్మడు అంతగా ప్రశ్నలు వేసింది అని కాదు.. వర్మకు నచ్చే యాంగిల్ అంటే అది కేవలం రొమాన్స్.. వర్మలో దాగి ఉన్న రొమాన్స్ ను బయటకు తెచ్చేలా ప్రశ్నలు వేసింది.. దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనేలా పాపులర్ అయింది.



ఇంటర్వ్యూకి ముందే అరియానాని చూసిన వర్మ.. ‘నీ ఫిజికల్ బ్యూటీ చాలా బాగుందని’ అన్నారని చెప్తోంది అరియానా. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌‌గా ఉన్న అరియానాకు సంబంధించిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇంటర్వ్యూ సందర్భంగా వర్మ తనతో ఎలా ప్రవర్తించారో చెప్పి తెగ మురిసిపోయింది. మొత్తంగా నీ ఫిజిక్ , నీ థైస్ ఇవన్నీ కూడా నన్ను పిచ్చి వాడిని చేస్తున్నాయి అంటూ వర్మ అనడం నాకు లోపాల సంతోషంగా ఉన్నా బయటకు మాత్రం సిగ్గుగా అనిపించింది.. అంటూ తబ్బి ఉబ్బి పోయింది.నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అరియనాను కెప్టెన్ గా బిగ్ బాస్ నిర్ణయించారు..


మరింత సమాచారం తెలుసుకోండి: