తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు నటి కాజల్ అగర్వాల్. లక్ష్మీకళ్యాణం సినిమాతో తెరంగ్రేటం చేసిన ఈ భామ. కెరీర్ మొదలై దశాబ్దం అవుతోన్న కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తోంది. ఇప్పటికీ వరుస సినిమాలతో అదరగొడుతోనే ఉంది. ఓ వైపు కుర్ర హీరోలతోపాటు సీనియర్స్‌తో కూడా జత కట్టేస్తోంది. తెలుగు ప్రేక్షకులను తన అంద చందాలతో, ఎవరని నొప్పించకుండా అలరిస్తూనే ఉంది. తెలుగులో దాదాపు అందరూ హీరోలతో నటించింది. కాగా, ఈ మధ్య కాలంలో కాజల్‌ పెళ్లి చేసుకోబోతున్న వార్త అందరికి తెలిసిందే.

ఇక కాజల్ తన పెళ్లికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది. ఆమె పెళ్లి ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుతో ఈ నెల 30న ముంబైలో తన వివాహం జరగబోతున్నట్లు కాజల్‌ అధికారికంగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో కాజల్ గౌతమ్ ల నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది. వివాహనికి ఇంకా ఒకరోజు మాత్రమే ఉన్న నేపథ్యంలో తాజాగా మెహందీ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కాజల్ గురువారం తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.


అయితే సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఓ డౌట్ ని వ్యక్తం చేస్తున్నారు. అదేంటంటే పెళ్లి కోసం కాజల్ ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అని అంటున్నారు నెటిజన్స్. ఇక కాజల్ ఫోటో చూసిన వారంతా లేటెస్ట్ ఫోటోలలో ఆమె చీక్స్, లిప్స్ డిఫరెంట్ గా కనిపిస్తున్నాయని అంటున్నారు. దీంతో బహుశా ఆమె మరింత అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఉండోచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే కాజల్ సర్జరీ చేయించుకుందా లేదా పెళ్లి కళ వల్ల ముఖం అలా వెలిగిపోతుందా అనేది తెలియాల్సీ ఉంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: