టాలీవుడ్ టాప్ స్టార్ నందమూరి బాలక్రిష్ణ మైండ్ లో ఒకటి గట్టిగా ఫిక్స్ అయితే ఇక అమలు చేసి తీరుతారు. ఆయన ఇపుడు అలాంటి  పట్టుదల మీదే ఉన్నారు. ఎపుడో మూడు దశాబ్దాల నుంచి బాలయ్య తాను ఒక డ్రీమ్  ప్రాజెక్ట్ చేయాలని చెబుతూ వస్తున్నారు. ఆ పాత్రకు ఇన్నాళ్ళకు ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఆయన రెడీ అయిపోయారు. అదే 12వ శతాబ్దం కాలం నాటి గోనగన్నారెడ్డి మూవీ. ఇది చారిత్రక నవలగా వచ్చి పాఠకుల ప్రశంసలు బాగానే  అందుకుంది.

దాన్ని కచ్చితంగా సినిమాగా తీస్తాను అని బాలయ్య అంటున్నారు. ఈ సినిమా డైరెక్షన్ చేసే బాధ్యతలను ఆయన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కి అప్పగించారని అంటున్నారు. బాలయ్యతో ఇప్పటికే మూడవ చిత్రాన్ని బోయపాటి తీస్తున్నారు. దీనిని బ్లాక్ బస్టర్ హిట్ గా చేయాలని ఆయన తపనపడుతున్నారు. బోయపాటి కెరీర్లో ఇప్పటిదాకా యాక్షన్ సినిమాలే చేశారు. మరి ఫస్ట్ టైం బాలయ్య ఆయన్ని నమ్మి హిస్టారికల్ మూవీని చేయమని కోరుతున్నారట.

ఇక ఈ మూవీకి పవర్ ఫుల్ డైలాగ్స్ రాసే బాధ్యతను స్టార్  డైరెక్టర్ పూరీ జగన్నాధ్ కి బాలయ్య అప్పగించారని అంటున్నారు. మరి పూరీ మార్క్ డైలాగ్స్, బోయపాటి టేకింగ్ తో గోనగన్నారెడ్డి కనుక వస్తే అది అదిరిపోయే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ అవసరంలేదు. ఇక ఈ మూవీని బాలయ్య తన సొంత బ్యానర్లోనే తీయాలనుకుంటున్నారుట. అలాగే మరో ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ ని ఇందులో భాగస్వామిగా చేసుకుని మూవీని తీయాలని బాలయ్య ఇప్పటికే డిసైడ్ అయ్యారని అంటున్నారు.

మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అంటున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య బోయపాటి మూవీ తరువాత వెంటనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తెస్తారా లేక మరో సినిమా తరువాత దీని టేకప్ చేస్తారా అన్నది ప్రస్తుతానికి తెలియడంలేదు. మొత్తానికి గోన గన్నారెడ్డి పాత్రధారిగా బాలయ్య కనిపించడం ఖాయమని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: