అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ లీడ్ రోల్ లో ప్రదీప్ డైరక్షన్ లో వస్తున్న సినిమా కపటదారి. కన్నడ సినిమా కవలుదారి అఫీషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజైంది. ఈ టీజర్ చూస్తే సుమంత్ ఈసారి పక్కా హిట్టు కొట్టేలా ఉన్నాడని అనిపిస్తుంది. ప్రపంచంలో జరిగే ప్రతి విషయానికి బలమైన ఏదో ఒక కారణం ఉంటుందని టీజర్ స్టార్టింగ్ లో చెబుతాడు.

ఇక ట్రాఫ్ పోలీస్ గా ఉన్న సుమంత్ సడెన్ గా ఓ మర్డర్ మిస్టరీని కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. హయ్యర్ అఫీషియల్స్ తనని వద్దని వార్నింగ్ ఇచ్చినా సరే సుమంత్ అనుకున్నది చేస్తాడు. కపటదారి టీజర్ సస్పెన్స్ బాగా మెయింటైన్ చేసినట్టు ఉంది. టీజర్ మాత్రం ఆడియెన్స్ కు బాగా నచ్చేసింది. తప్పకుండా సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే మాత్రం సుమంత్ కు ఓ సూపర్ హిట్ పడినట్టే.

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. కపటదారి సినిమాతో సుమంత్ ఓ అటెంప్ట్ చేస్తున్నాడు. తప్పకుండా సుమంత్ ప్రయత్నిస్తున్న ఈ జానర్ అతనికి మంచి ఫలితాన్ని ఇచ్చేలా ఉందని చెప్పొచ్చు. కపటదారి సినిమా టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇదం జగత్ సినిమాని కూడా ఇదే పంథాలో తీసిన సుమంత్ ఆ సినిమాతో టార్గెట్ మిస్ అయ్యాడు. మరి కపటదారి అయినా అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.                                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: