టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చాక దూకుడు మామూలుగా లేదు. ఆయన మొదట గతంలో కమిట్ అయిన సినిమాలు మాత్రమే చేస్తారని అంతా అనుకున్నారు. కానీ పవన్ ఒకటి నుంచి మొదలుపెట్టి నంబర్ ని ఇప్పటికి అయిదుకు తెచ్చారు. ఇంకా ఆయన మరికొన్ని సినిమాలు కూడా చేస్తారని ఫిల్మ్ మేకర్స్ నుంచి ప్రకటనలు అయితే వస్తున్నాయి. కానీ పవన్ చేతిలో మాత్రం  ఇప్పటికైతే అయిదు సినిమాలు పక్కాగా ఉన్నాయి. వీటిలో వకీల్ సాబ్ మాత్రం ఇప్పటికి 90 శాతం షూటింగ్ పూర్తి అయింది. నవంబర్ మొదటి వారం నుంచి పవన్ షూటింగ్ కి వస్తే ఆ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవుతుంది అంటున్నారు.

ఆ వెంటనే క్రిష్ మూవీ, హరీష్ శంకర్ మూవీ లైన్లో ఉన్నాయి. అలాగే అయ్యప్పన్ కోషియం తెలుగు రీమేక్ మూవీ కూడా పవన్ చేయాల్సి ఉంది. ఈ మూవీస్ తో పాటుగానే సురేందర్ రెడ్డి మూవీ కూడా ఉంది. ఇవి పవన్ కమిట్ అయినవి. కచ్చితంగా రెండేళ్ళ సమయం సరిపడా వీటికి అవుతుంది అంటున్నారు. పవన్ షూటింగ్ అంటే చాలా స్లోగా చేస్తారని పేరుంది. గతంలో ఆయన ఒక సినిమా చేయడానికి ఏడాది కంటే ఎక్కువ టైమే తీసుకున్నారు. ఇపుడు కనుక అలా చేస్తే రాజకీయంగా పవన్ స్పీడ్ అవడానికి అసలు వీలుండదు.

దాంతో పవన్ జోరు పెంచాల్సిందేనని అంటున్నారు. ఇక పవన్ సినిమా షూటింగులు కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు వచ్చే ఏడాదికి క్రిష్, హరీష్ శంకర్ కి కేటాయించి ఆ మధ్యలో అయ్యప్పన్ కోషియన్ పూర్తి చేయాలని ఒక ప్లాన్ ఉందిట. ఇక 2022 నాటికి సురేందర్ రెడ్డి  మూవీ ఉందని అంటున్నారు. మొత్తానికి పవన్ మాత్రం  దూకుడు మీదనే సినిమాలు చేయాల్సి ఉంటుంది అంటున్నారు. ఆయన ఊపిరి సలపకుండా షూటింగులు చేస్తేనే తాను అనుకున్నట్లుగా అయిదు సినిమాలూ పూర్తి చేసి అభిమానుల ముందుకు తేగలరని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: