రజనీకాంత్‌ మనసును ఓ నటుడు ముందే కనిపెట్టాడు. రాజకీయాల్లోకి కొంచెంసేపు వస్తావంటావు.. రానంటావు. ఇదేంటని సూపర్‌స్టార్‌ మొహం మీదే అడిగేశాడు.  ఈ సీన్ అంతా రజనీ నటించిన కథానాయకుడు సినిమాలోనిది. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రారంటూ బైటకొచ్చిన లేఖ.. దీనికి సూపర్‌స్టార్‌ విశ్లేషణ చూస్తుంటే.. రజనీకాంత్‌ కొత్తపార్టీ విషయంలో డైలమాలో ఉన్నట్టే కనిపిస్తున్నాడు.

రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ గురించి అభిమానులు చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నానంటూ.. మూడేళ్ల క్రితం రజనీ చెప్పడంతో.. కన్‌ఫ్యూజన్‌కు తెరపడింది. అయితే.. ఆ మధ్య తను ముఖ్యమంత్రిగా ఉండనని.. పార్టీని వెనకనుండి నడిపిస్తాననడం.. అభిమానుల్లో కలకలం సృష్టించింది. దీంతో.. ఆయన వీరాభిమాని లారెన్స్‌కు నచ్చలేదు. రజనీకాంత్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా లేకుంటే.. పార్టీలో ఉండనని బాహాటంగానే చెప్పేశాడు.

రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఎప్పటికీ ఇష్యూనే. తెగదూ.. ముడిపడదు. రజనీకాంత్‌ పేరుతో ఓ లేఖ సోషల్‌ మీడియాలో బుధవారం వైరల్‌ అయింది. నాకు కిడ్నీ సమస్య ఉంది. ప్రస్తుతం పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో పొలిటికల్‌గా ఏ నిర్ణయం తీసుకోవాలనేది అభిమానులు, ప్రజలకే వదిలేస్తున్నానంటూ రజినీ కోరినట్టు ఆ లేఖలో ఉంది. దీంతో.. ఆయన రాజకీయ ప్రవేశం ప్రశ్నార్ధకంగా మారింది.

బుధవారం వైరల్‌ అయిన లేఖతో సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొంది. దీంతో.. రజనీ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ఆ లేఖ తను రాసింది కాదని చెప్పేశాడు. అయితే.. అందులో ఆరోగ్యం గురించిన సమాచారం నిజమేనన్నారు. రాజకీయ ప్రవేశంపై తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పడంతో ఫ్యాన్స్‌ షాకు గురయయాడు. ఆల్ రెడీ పార్టీ పెడతానని చెప్పి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో వాళ్లకు అర్థం కావడం లేదు. సూపర్‌స్టార్‌  యుటర్న్‌ తీసుకున్నాడంటూ..  ప్రత్యర్థులు నెట్‌లో కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఎన్నో సందేహాలు నెలకొన్నాయి.ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి.







మరింత సమాచారం తెలుసుకోండి: