బిగ్ బాస్ సీజన్ 4 లో హోస్ట్ గా నాగార్జున చిన్నపాటి బ్రేక్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన చేస్తున్న వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం కులుమనాలి వెళ్లారు నాగార్జున. ఊపిరి రైటర్ సోల్మన్ డైరక్షన్ లో వైల్డ్ డాగ్ సినిమా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం 21 రోజుల పాటు హిమాలయాల్లో ఉంటున్నాడు నాగార్జున. ఇదిలాఉంటే బిగ్ బాస్ లో వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగ్ బదులుగా అక్కినేని కోడలు సమంత అటెండ్ అయ్యింది.

తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ సమంత మెప్పించింది. దసరా స్పెషల్ ఎపిసోడ్ కు సమంత హోస్ట్ గా చేయడం షోకి మరింత కలర్ తెచ్చిపెట్టింది. దసరా ఎపిసోడ్ మాత్రమే కాదు మరో రెండు వారాలు కూడా సమంత హోస్ట్ గా చేస్తుందని అంటున్నారు. ఈ వీకెండ్ కూడా సమంత హోస్ట్ గా వస్తుందని టాక్. మొత్తం 5 ఎపిసోడ్స్ కు సమంత భారీ డీల్ సెట్ చేసుకుందని అంటున్నారు. ఈ వారం కూడా సమంత హోస్ట్ అయితే తప్పకుండా బిగ్ బాస్ కు మరింత క్రేజ్ వచ్చినట్టే.

లాస్ట్ సీజన్ లో కూడా నాగార్జున ఒక వారం మిస్ అవగా ఆయన బదులుగా శివగామి రన్యకృష్ణ హోస్ట్ గా వచ్చారు. ఈ సీజన్ లో మాత్రం రమ్యకృష్ణ బదులుగా సమంత హోస్ట్ గా వచ్చింది. మొత్తానికి సమంత తన టాలెంట్ తో అందరిని మెప్పిస్తుంది సిల్వర్ స్క్రీన్ మాత్రమే కాదు స్మాల్ స్క్రీన్ పై కూడా ఆమెకు తిరుగులేదని అనేలా చేసుకుంటుంది.                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: