ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ప్రభాస్‌.. పూజా హెగ్డేతో కలిసి రాధే శ్యామ్ షూట్‌ కోసం ఇటలీ వెళ్లాడు. ఇక యంగ్‌ హీరోలు దాదాపుగా సెట్స్‌పైకి వచ్చేశారు. తెలుగు ఇండస్ట్రీలో అందరూ బయటకు వచ్చినా.. మెగా హీరోలు మాత్రం ఇంటికే పరిమితమయ్యారు. చిరంజీవి.. పవన్.. బన్నీ సినిమాలు కరోనా కారణంగా ఆగిపోయాయి. మళ్లీ వీటిని మొదలుపెట్టేది ఎప్పుడు? మెగా సందడి ఎప్పుడు మొదలవుతుందనే అనుమానాలు సినీజనాల్లో కలుగుతున్నాయి.

సీనియర్‌ హీరో నాగార్జున అందరికంటే.. ముందుగా రెండు నెలల క్రితమే కెమెరా ముందుకు వచ్చేశాడు. 40 రోజుల నుంచి బిగ్‌బాస్‌4కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. కరోనా తగ్గేవరకు నో షూటింగ్‌ అన్న బాలకృష్ణ గురువారం బోయపాటి మూవీలో జాయిన్‌ అయ్యాడు. అయితే మరో 60 ప్లస్‌ హీరో చిరంజీవి మూవీ ఆచార్య గురించి ఎలాంటి అప్‌డేట్‌  రాలేదు.

షూటింగ్స్ చేసుకోవడానికి పర్మీషన్ ఇవ్వాలని అందరికంటే ఎక్కువ పట్టుబట్టిన హీరో చిరంజీవి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలిశాడు. ఈ లోగా.. ఆచార్య కథ తనదే అంటూ.. యువ రచయిత చేసిన ఆరోపణతో రచ్చ అయింది. ఈ కారణంగానే సినిమాను ఇంకా మొదలుపెట్టలేదని.. కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో.. షూటింగ్‌ ఆలస్యమైందనేది ఇన్‌సైడ్‌ టాక్‌. మెగా హీరోలందరికంటే చిరంజీవి లేటుగా.. నవంబర్‌ మూడో వారంలో కెమెరాముందుకు వస్తాడట.

పవన్ నటిస్తున్న వకీల్‌సాబ్‌ షూటింగ్‌ ఈ నెలలోనే మొదలైనా.. హీరోలేని సీన్స్‌ తీశాడు దర్శకుడు వేణు శ్రీరామ్‌. నవంబర్‌ మొదటివారంలో పవన్ జాయిన్‌ అవుతాడని తెలిసింది. ఏడు నెలలుగా పవన్‌ను గడ్డంతో చూడడానికి అలవాటుపడిపోయిన ఫ్యాన్స్‌ తమ హీరోను క్లీన్‌ షేవ్‌తో కొత్తగా చూస్తారు.

మెగా హీరోల సందడి నవంబర్‌లో మొదలుకానుంది. బన్నీ, రష్మిక జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ఫ షూటింగ్‌ చాలావరకు అడవుల్లో జరగనుంది. కేరళ అడవుల్లో షూట్‌ ప్లాన్‌ చేస్తే.. ఇంతలో కరోనా వచ్చింది. మొదట్లోనే రిస్క్‌ చేయడం ఇష్టం లేక.. అడవుల్లో షూట్‌ వద్దనుకున్నచిత్ర యూనిట్‌ నవంబర్ 6నుంచి విశాఖపట్నంలో సినిమాను మొదలుపెడతారట.



మరింత సమాచారం తెలుసుకోండి: