బిగ్ బాస్ సీజన్ 4లో ఎనిమిదవ వారం నామినేషన్ లో ఆరుగురు హౌజ్ మేట్స్ ఉన్నారు. ఈ ఆరుగురిలో ఎవరు హౌజ్ నుండి బయటకు వెళ్తారన్న క్లారిటీ ఆల్రెడీ వచ్చేసింది. హౌజ్ లో పెద్దాయన అమ్మా రాజశేఖర్ ఈ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఓటింగ్స్ లో కూదా అందరి కన్నా చివర్లో అమ్మా రాజశేఖర్ ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో అఖిల్, మోనాల్, అరియానా, మెహబూబ్, అమ్మా రాజశేఖర్, లాస్య ఉన్నారు.

ఈ ఆరుగురిలో అమ్మా రాజశేఖర్ ఈ వారం హౌజ్ నుండి బయటకు వస్తారని అంటున్నారు. హౌజ్ లో ఆయన ఆట తీరు బాగున్నా ప్రతి విషయంలో ఆయన గొడవ పడటం.. హౌజ్ మేట్స్ మీద పర్సనల్ ఎటాక్ చేయడం జరుగుతుంది. ఈ వారం హౌజ్ నుండి హౌజ్ నుండి ఎవరు బయటకు వస్తున్నారు అన్నది ఆదివారం తెలుస్తుంది. ఆరుగురిలో ఒకరు ఈ వారం హౌజ్ లో బయటకు వస్తారు.

ఇక ఈ వారం హోస్ట్ గా సమంత వస్తుందని అనుకోగా ఈ వారం నాగ్ హోస్ట్ గా వస్తారని తెలుస్తుంది. మనాలి నుండి శుక్రవారం ఆయన హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ శని ఆదివారాల్లో హోస్ట్ గా నాగార్జుననే చేస్తారని తెలుస్తుంది. తప్పకుండా ఈ వారం స్పెషల్ గా ఉంటుందని మాత్రం చెప్పొచ్చు. గురువారం హౌజ్ నుండి నోయెల్ కూడా అనారోగ్య సమస్యతో బయటకు వచ్చాడు. ప్రస్తుతం 10 మంది ఉన్న బిగ్ బాస్ హౌజ్ లో ఈ వారం ఒకరు ఎలిమినేట్ ఎలిమినేట్ అయితే 9 మంది మాత్రమే ఉంటారు. వారిలో టాప్ 5కి ఎవరు వెళ్తారో చూడాలి.                            

.


మరింత సమాచారం తెలుసుకోండి: