నిధి అగర్వాల్‌.. నభా నటేశ్‌  హీరోయిన్స్‌గా కంటే.. ఇస్మార్ట్‌ శంకర్‌ భామలుగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. బీచ్‌లో ఈ ఇద్దరూ వడ్డించిన ఇస్మార్ట్‌ అందాలు సినిమా సక్సెస్‌కు ఉపయోగపడ్డాయి. ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత బిజీ అయిపోతామని ఈ ఇద్దరూ ఆశించారు.  అయితే.. ఈ ఇద్దరిలో ఒకరిని  మాత్రమే అవకాశాలు వరించాయి. ఆ లక్కీ హీరోయిన్‌ ఎవరో కాదు నభానటేశ్.

ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ పెద్ద హీరోలతో జత కట్టే ఛాన్స్‌ తీసుకొస్తుందని నిధి, నభా ఆశపట్టారు. సినిమా రిలీజైన ఆరు నెలల వరకు ఆఫర్సే రాలేదు. నిధి ప్రస్తుతం కొత్త హీరో గల్లా ఆశోక్‌ మూవీ ఒక్కటే చేస్తోంది. నభా మాత్రం కాస్త లేటైనా.. నాలుగైదు ఆఫర్స్‌తో బిజీ అయిపోయింది.

నిధి అగర్వాల్ గ్లామర్‌ను మాత్రమే నమ్ముకుంటే.. నభా స్కిన్‌షోతోపాటు.. పెర్‌ఫార్మెన్స్‌ను కూడా నమ్ముకుంది. నిధి పెర్‌ఫార్మెన్స్‌లో వీక్‌ కావడం.. నభా నటేశ్ కు ప్లస్‌ అయింది. ఇస్మార్ట్‌లో తెలంగాణా యాస‌తో ఆకట్టుకొని..  డిస్కోరాజాలో రవితేజాతో జత కట్టే అవకాశం కొట్టేసింది. సాయిధరమ్‌ తేజ్‌తో నటించిన 'సోలో బతుకే సో బెటర్‌' షూటింగ్‌ పూర్తయింది. అల్లుడు అదుర్స్‌ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో జత కడుతోంది నభా నటేశ్.

శాండిల్‌వుడ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడభామ 'నన్నుదోచుకుందువటే' మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌తో నాలుగు సినిమాలు వెనకేసుకుంది. అంధాదున్‌ తెలుగు రీమేక్‌లో నితిన్‌ హీరోయిన్‌గా సెలెక్ట్‌ అయింది. హిందీలో రాధికా ఆప్టే పోషించిన రోల్‌ ఈ అమ్మడికి దక్కింది.

 ఇస్మార్ట్ శంకర్ తో తొలి హిట్ కొట్టారు నభా నటేశ్, నిధి అగర్వాల్. ఇద్దరూ గ్లామర్ డాల్సే అయినా ఈ ఇస్మార్ట్ భామల్లో ఒక్కరికే అధృష్టం వరించింది.  అయితే హై పెర్ఫామెన్స్ తో ఎన్నో అవకాశాలు కొట్టేసింది నభా నటేశ్. డిస్కోరాజా.. సోలోబతుకే సో బెటర్‌.. అల్లుడు అదుర్స్‌ లో తన టాలెంట్ ఏంటో చూపించింది.







మరింత సమాచారం తెలుసుకోండి: