శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవర్ స్టోరీ సినిమా చేస్తున్న నాగ చైతన్య గత కొన్ని సినిమాలుగా ప్రేక్షకులను నిరాశపరుస్తున్నాడని చెప్పొచ్చు..  శైలజా రెడ్డి అల్లుడు అనుకున్నంత ఆడలేదు.ఆ తర్వాత వచ్చిన మజిలీ సినిమా క్రెడిట్ అంతా సమంత కొట్టేసింది. వెంకీ మామ అనుకున్నంత హిట్ అవలేదు.. దాంతో నాగ చైతన్య కి ఒక సోలో హిట్ కొట్టాల్సిన అవసరం అయితే ఉంది.. ఇప్పుడు చేస్తున లవ్ స్టొరీ సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు చైతు.. ఇక ఈ సినిమా చివరిదశలో ఉండగా సాయి పల్లవిసినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది.. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ పాట రాగ ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది..

ఇక ఈ సినిమా తరువాత చైతు తన తదుపరి సినిమా గా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యు అనే సినిమా చేయబోతున్నాడు.. మనం లాంటి వెరైటీ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకేక్కనుందట.. ఇటీవలే ఈ సినిమా టీం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది..  ఇక ఈ సినిమా తర్వాత పలువురి దర్శకుల కథ విన్నా చైతు ఏ సినిమా ని ఓకే చేయలేదు.. వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమా తో మంచి హిట్ కొట్టిన వెంకి అట్లూరి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చైతుకి చెప్పిన ఓ పాయింట్ బాగా నచ్చిందని వార్తలు వచ్చినా ఏ అనౌన్స్ మెంట్ రాలేదు..

అయితే ఆసక్తి కర విషయం ఏంటంటే యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో చైతు ఓ సినిమా చేయబోతున్నాడట..చైతూ హీరోగా ఒక భారీ యాక్షన్ సినిమా చేయాలని అర్జున్ భావిస్తున్నాడట. అక్కినేని వారసుడికి కథ కూడా చెప్పాడని.. అతను ఆసక్తితోనే ఉన్నాడని.. త్వరలోనే దీని గురించి ప్రకటన ఉండొచ్చని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. యాక్షన్ హీరో గా గుర్తింపు తెచ్చుకోవాలని యాక్షన్ మూవీ ‘యుద్ధం శరణం’ దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆ తర్వాత ఆ జానర్ జోలికి వెళ్లలేదు. మళ్ళీ ఇప్పుడు యాక్షన్ ప్రాధాన్యమున్న సినిమా ని చేస్తున్నాడు..మరి చైతు ప్రయత్నం ఫలిస్తుందా చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: