బిగ్ బాస్ సీజన్ 4 లో 55 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా హౌజ్ మేట్స్ కు తమ బిగ్ బాస్ ప్రయాణాన్ని చూపించారు. ఈ ప్రయాణంలో హౌజ్ మేట్స్ వారిని వారు చూసుకుని చాలా సంతోషపడ్డారు. మంచి, చెడు, ఆటలు, పాటలు, నవ్వులు, ఏడుపులు ఇవన్ని ఈ ప్రయాణంలో ఉన్నాయి. అయితే సగం పేజీలు మాత్రమే పూర్తయిన ఈ బిగ్ బాస్ ప్రయాణం వీడియో చూసి హౌజ్ మేట్స్ అంతా భావోద్వేగానికి గురయ్యారు.

బిగ్ బాస్ చూపించిన ఈ వీడియోలో మోనాల్ తో అభి ఇంకా అఖిల్ ల రిలేషన్ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. ఈమధ్యనే అఖిల్,  అభిజిత్ లు తమ మధ్య ఉన్న గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టారు. అభిజిత్ కూడా మొన్న నామినేషన్స్ లో అన్నిటిని సార్ట్ అవుట్ చేసుకుంది. బిగ్ బాస్ 55 రోజుల ప్రయాణం చూసి మోనాల్ అభిజిత్, అఖిల్ లను హగ్ చేసుకుని కన్నీళ్ళు పెట్టుకుంది. బిగ్ బాస్ లో వీరిది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా నడిచింది.

ఇక మరోపక్క హౌజ్ మేట్స్ అందరి ఆట పాటలు కూడా ఈ వీడియోలో హైలెట్ అయ్యాయి. ఫైనల్ గా బిగ్ బాస్ సగం రోజుల ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు హౌజ్ మేట్స్ కు మిగిల్చాయి. అయితే రానున్న రోజుల్లో ఆట మరింత రసవత్తరంగా కానుంది. హౌజ్ మేట్స్ మధ్య టఫ్ టాస్కులు ఇవ్వనున్నాడు బిగ్ బాస్. ప్రస్తుతం 10 మంది ఉన్న బిగ్ బాస్ హౌజ్ లో ఎవరు టాప్ 5లో ఉంటారు. టాప్ 2లో ఎవరి నిలుస్తారు అన్నది మాత్రం త్వరలో తెలుస్తుంది.                                          

మరింత సమాచారం తెలుసుకోండి: