తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలితరం సూపర్ స్టార్ గా అత్యంత పేరు ప్రఖ్యాతులతో కొన్నేళ్లపాటు తిరుగులేకుండా నెంబర్ వన్ హీరోగా కొనసాగిన నటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్. ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ కొన్నేళ్ళపాటు నెంబర్ వన్ హీరో గా టాలీవుడ్ లో కొనసాగిన విషయం తెలిసిందే. అనంతరం తర్వాత తరంలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి దాదాపుగా రెండు దశాబ్దాల వరకు టాలీవుడ్ లో తిరుగులేని నెంబర్ వన్ హీరోగా కొనసాగారు. ఇక చిరంజీవి తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న తరంలో ఎవరు నెంబర్ వన్ హీరో అనే ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటాయి.

రాజకుమారుడు సినిమాతో సూపర్ స్టార్ మహేష్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా తెరంగేట్రం చేసి తమ ఆకట్టుకునే అందం అభినయంతో ఎందరో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఇక అక్కడి నుండి వరుసగా సినిమాలు చేస్తూ కొనసాగిన ఈ ఇద్దరు హీరోలు తమదైన యాక్టింగ్ టాలెంట్ తో కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్లో మంచి పేరున్న హీరోలు గా గొప్ప స్థానాన్ని దక్కించుకోవడం జరిగింది. ఇక ఈ ఇద్దరికీ దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ అలానే అన్ని విధాలుగా మార్కెట్ పరంగా కూడా సమానమైన క్రేజ్ ఉందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అయితే అటు ప్రేక్షకుల్లోనూ అలానే ఈ హీరోల అభిమానుల్లోనూ ఎప్పటి నుండో ఒక కోరిక మాత్రం తీరకుండానే మిగిలిపోయింది.

అదేమిటంటే వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అది ఇప్పటివరకు మాత్రం సాధ్యం కాలేదు. వాస్తవానికి కొన్నాళ్ళ క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ సినిమా చేయనున్నారని ఒక వార్త విస్తృతంగా ప్రచారం అయినప్పటికీ దానిపై ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం లేదు. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అవన్నీ జరుగుతాయా ఏంటి అంటూ కొందరు అభిమానులు సర్దుకుపోతూ ఉన్నప్పటికీ మరికొందరు మాత్రం తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ఇద్దరు హీరోలు కలిసి ఒక సినిమా చేస్తారని చేసేలా ఎవరైనా దర్శకుడు ముందుకు రావాలని కోరుతూ పలువురు ప్రేక్షకులు అభిమానులు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్ చేస్తున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యరం అవుతుందో తెలియాలంటే మరికొన్నాళ్లు ఓపికపట్టక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: