టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి రెండు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి రెండూ కూడా ఒకదానిని మించి మరొకటి గొప్ప విజయాలు అందుకని దేశవిదేశాల్లో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాయి. ఇక వాటి రిలీజ్ అనంతరం భారత దేశంలోని పలు ఇతర భాషల్లో పాన్ ఇండియా సినిమాలు తీయడం మరింతగా పెరిగింది. ఇక ప్రస్తుతం రాజమౌళి తీస్తున్న లేటెస్ట్ భారీ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా దీనిని డి.వి.వి.దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో భారీ లెవల్లో నిర్మిస్తున్నారు.  

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా యూనిట్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇటు మెగా నందమూరి అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు అలానే దేశవిదేశాల్లోని ప్రేక్షకులు అందరిలోనూ ఈ సినిమాపై భారీ స్థాయిలో లంచాలు ఉన్నాయి. ఇక గతంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి రెండు భాగాల సినిమాల రికార్డులను ఈ సినిమా తప్పనిసరిగా బద్దలు కొట్టి తీరుతుంది అని కొందరు అభిమానులు గట్టిగా చెప్తున్నారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాకు సంబంధించిన కొమరంభీం టీజర్ అలానే అల్లూరి సీతారామరాజు టీజర్లు రెండు కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకోవడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే కొందరు ఈ సినిమా గురించి అభిప్రాయపడుతూ బాహుబలి రికార్డులు కొట్టడం సంగతి అటు ఉంచితే, ఈ సినిమా కథ కథనాల విషయంలో రాజమౌళి ఏమాత్రం అలసత్వం వహించినా, అనంతరం వచ్చే రిజల్ట్ తేడా కొట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి దర్శక దిగ్గజం రాజమౌళి ఈ సినిమాలోని ప్రతి ఒక్క సీన్, అలానే ప్రతి ఒక్క అంశం విషయంలో ఎంతో కేర్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. తప్పనిసరిగా రేపు రిలీజ్ తర్వాత ఈ సినిమా బాహుబలి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని నెలల వరకు ఆగక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: