ప్రస్తుతం టాలీవుడ్లో మంచి పేరు, క్రేజ్ తో కొనసాగుతున్న దర్శకుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒకరు అని చెప్పక తప్పదు. తొలిసారిగా స్వయంవరం సినిమా ద్వారా కథకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన త్రివిక్రమ్ అక్కడి నుండి వరుసగా పలు సినిమాలకు కథ, మాటలు అందించి తన అద్భుతమైన డైలాగ్స్ టాలెంట్ తో ఎంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత తరుణ్, శ్రియల కలయికలో తెరకెక్కిన నువ్వే నువ్వే సినిమా ద్వారా మెగాఫోన్ పట్టి తొలిసారిగా దర్శకుడిగా మారిన త్రివిక్రమ్ దాని అనంతరం ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అతడు సినిమా తీశారు.

అప్పట్లో మంచి విజయం అందుకున్న ఆ సినిమా అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జల్సా, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో జులాయి సినిమాలు తీసి మరొక రెండు విజయాలు సొంతం చేసుకున్నారు త్రివిక్రమ్. ఇక అక్కడి నుండి వరుస అవకాశాలతో దూసుకెళ్లిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరీర్లో మంచి బ్లాక్ బస్టర్ విజయాలతో పాటు కొన్ని అపజయాలు కూడా చవిచూడటం జరిగినది. ఇక ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన అరవింద సమేత సినిమాతో భారీ హిట్ ను అందుకున్న త్రివిక్రమ్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించిన అలవైకుంఠపురములో సినిమా ద్వారా మరొక గొప్ప విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక అతి త్వరలో మరొక సారి ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న త్రివిక్రమ్ దానికిగాను భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

ఇప్పటి వరకూ కొనసాగిన లెక్క ఒకటి అయితే, ఇకపై త్రివిక్రమ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ మరోర ఎత్తని అంటున్నారు. అందుతున్న సమాచారాన్ని బట్టి టాలీవుడ్ లో దర్శక దిగ్గజం రాజమౌళి తర్వాత ప్రస్తుతం దాదాపుగా ఆ స్థాయిలోనే త్రివిక్రమ్ కూడా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అయితే తన క్రేజ్ మరింతగా పెరిగింది కాబట్టే త్రివిక్రమ్ కూడా ఆ రేంజ్ లోనే డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. కాగా ఆయనకు మంచి టాలెంట్ ఉంది కాబట్టే రెమ్యూనరేషన్ కూడా ఆయన ఆ స్థాయిలో ఆశించడం తప్పేం లేదు అంటూ కొందరు అభిమానులు ఆయనకు మద్దతు పలుకుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: