బిగ్ బాస్ సీజన్ 4లో ఈ వీకెండ్ హోస్ట్ గా ఎవరు వస్తున్నారు అన్న దాని మీద రకరకాల వార్తలు వస్తున్నాయి. హోస్ట్ గా చేయాల్సిన నాగార్జున వైల్డ్ డాగ్ షూటింగ్ కు వెళ్ళగా అక్కడ 21 రోజుల షూటింగ్ లో బిజీ అవడంతో బిగ్ బాస్ హోస్ట్ గా నాగ్ డుమ్మా కొడతాడని తెలుస్తుంది. దసరా స్పెషల్ ఎపిసోడ్ గా సమంత హోస్ట్ గా వచ్చి అలరించింది. అక్కినేని కోడలిగా సమంత కూడా నాగార్జున బాధ్యతని సక్సెస్ఫుల్ చేసింది.

అయితే ఈ వారం కూడా హోస్ట్ గా నాగార్జున వస్తాడా.. లేక సమంత వస్తుందా అన్న కన్ ఫ్యూజన్ ఉంది. ఇక లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ వారం బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున హోస్ట్ గా వస్తారని తెలుస్తుంది. మనాలి నుండి శుక్రవారం హైదరబాద్ లో దిగినట్టు తెలుస్తుంది. సో బిగ్ బాస్ కోసమే నాగ్ హైదరాబాద్ వచ్చినట్టు చెబుతున్నారు.

దసరా ఎపిసోడ్ మాత్రమే కాదు సమంతతో ఐదు వారాల డీల్ చేసుకున్నారని అన్నారు. కాని ఈ వారాంతరం నాగ్ వచ్చి హోస్ట్ గా అలరిస్తాడని తెలుస్తుంది. ఒక వారం మాత్రమే గెస్ట్ హోస్ట్ గా సమంత అలరించింది. తప్పకుండా ఈ వారం నాగ్ ఆడియెన్స్ కు డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని చెప్పొచ్చు. ఈ వారం ఎన్నో స్పెషల్స్ జరిగాయి వాటి గురించి నాగ్ ఎలా మాట్లాడుతారో చూడాలని ఆసక్తిగా ఉన్నారు ప్రేక్షకులు.                                                                            

మరింత సమాచారం తెలుసుకోండి: