అనుకోకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క శెట్టి అనతి కాలం లోనే దక్షిణాదిలో టాప్ హీరోయిన్ హోదా సంపాదించింది. మొదట్లో కాస్త గ్లామర్ ఎక్కువ ఉన్న రోల్స్ చేసినా నెమ్మది నెమ్మదిగా ఆమెకు పవర్ఫుల్ రూల్స్ పడడం మొదలైంది. ఆమె లీడ్ రోల్ లో చేసిన అరుంధతి సినిమా ఆమె కెరీర్ కి చాలా ప్లస్ అయింది. ఈ సినిమా దెబ్బకి ఈమెను ఎలా పడితే అలా చూపించడం మానేశారు దర్శకులు. దీంతో ఈమె క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఈమెకు హీరోలతో సమానంగా ఫ్యాన్ వేసి కూడా ఏర్పడింది.

ఎలాగైతే హీరోల అభిమానులు పుట్టిన రోజులు జరుపుతారో ఈమె కూడా పుట్టిన రోజు జరపటానికి ప్లాన్ చేస్తున్నారు ఆమె అభిమానులు. అయితే హీరోల పుట్టిన రోజు అంటే ఒక రోజు రెండు రోజులు చేయటం రివాజు కానీ అనుష్క ఫ్యాన్స్ మాత్రం ఏకంగా వారం రోజుల పాటు వారోత్సవాల లాగా చేస్తున్నారు. అయితే అందరి ఫ్యాన్స్ సంగతి అయితే తెలియదు కానీ వరంగల్ జిల్లా అనుష్క ఫ్యాన్స్ మాత్రం నవంబర్ ఒకటో తారీకు నుంచి నవంబర్ 7 తారీఖు దాకా ఆమె పుట్టిన రోజులని వారోత్సవాలలాగా ప్లాన్ చేశారు.

నవంబర్ 1న పిల్లలకి స్నాక్స్ టిఫిన్స్ పంపిణీ, అలాగే నవంబర్ 2న వరద బాధితులకు బట్టలు పంపిణీ, నవంబర్ మూడో తారీఖున స్కూల్ పిల్లలకి పుస్తకాలు బట్టలు పంపిణీ, నవంబర్ నాలుగో తారీఖున శానిటైజర్ మాస్కులు పంపిణీ, నవంబర్ 5వ తారీఖున వృద్ధులకు దుప్పట్లు పంపిణీ, నవంబర్ ఆరో తారీఖున అవసరమైన వారికి నిత్యావసరాల పంపిణీ ప్లాన్ చేశారు. ఇక ఆమె పుట్టిన రోజు అయిన ఏడో తారీఖున అయితే ఏకంగా అనుష్క కోసం హోమం తలపెట్టారు. అలానే ఆ రోజున రక్తదానం కూడా చేస్తున్నారు. అంతే కాక భారీ రేంజ్ లో కేక్ కటింగ్ కూడా అదే రోజున ప్లాన్ చేశారు. ఈ రోజులలో హీరోలకే ఒకటి రెండు రోజుల్లో కానిస్తుంటే హీరోయిన్ కి వారోత్సవంలాగా  పుట్టినరోజు సంబరాలు అంటే మామూలు విషయమా మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: