మలయాళ భామ కీర్తి సురేష్ ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే ఆమె నటించిన సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నా థియేటర్లో తెరుచుకుని కారణంగా ఆయా సినిమాలని మేకర్స్ ఇంకా హోల్డ్ లో ఉంచారు. అయితే ఆమె నటించిన ఒక సినిమా మాత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఆ సినిమా పేరే పెంగ్విన్. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో దీన్ని డిజిటల్ రిలీజ్ చేశారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేదు. డిజిటల్ కి అమ్మేసి మంచి పని చేశారు గాని థియేటర్లలో రిలీజ్ చేసి ఉంటే భారీగా నష్టపోయేవారని అంటున్నారు కొందరు ట్రేడ్ వర్గాల వారు.

 అయితే ఆ విషయం ఎలా ఉన్నా ఈ సినిమా శాటిలైట్ హక్కులు కొనుక్కున్న జీతెలుగు మాత్రం ఈ సినిమాని టెలికాస్ట్ చేయడానికి రెడీ అయిపోయింది. ఈ సినిమాని వచ్చే నెల 8 వ తారీఖున అంటే ఆదివారం రోజున వరల్డ్ ప్రీమియర్ అంటూ టెలికాస్ట్ చేయాలని చూస్తున్నారు. అయితే డిజిటల్ లో రిలీజ్ అయి అంతగా పేరు తెచ్చుకొని పెంగ్విన్ సినిమా టెలివిజన్ టెలీకాస్ట్ విషయంలో ఏ మేరకు రేటింగ్స్ తెచ్చుకుంటుందన్న విషయం చూడాలి. అదీ గాక ఈ సినిమాని ప్రైం టైంలో వేయకుండా ఉదయం 11:30 కు టెలికాస్ట్ చేస్తున్నారు జీ తెలుగు వాళ్ళు.

సినిమా భారీగా డిజాస్టర్ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం ఉంది. ఈ సమయంలో టీవీ లో టెలికాస్ట్ చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక కీర్తి తదుపరి సినిమాల విషయానికి వస్తే ఆమె నితిన్ సరసన రంగ్ దే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీకి వెళ్లాల్సి ఉన్నా అక్కడ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో అక్కడికివెళ్ళడం లేదు. మరో పక్క ఈమె మహేశ్ బాబు హీరోగా  నటించాల్సిన సర్కార్ వారి పాట ఎప్పటికి మొదలు అవుతుందో ? తెలియని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: