ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. ఆదాశర్మ... నితిన్ "హార్ట్ ఎటాక్" సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి యూత్ మనసులను దోచుకుంది. తరువాత "సన్ ఆఫ్ సత్యమూర్తి", "క్షణం" సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం "క్వశ్చన్ మార్క్" అనే సినిమా చేసింది. శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకంపై ఈ హాట్ బ్యూటీ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో ఈ చిత్రం  నిర్మించబడింది. షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోన్న ఈ చిత్రం లోని `రామ‌స‌క్క‌నోడివిరో` అనే పాట‌ను ఈ రోజు హైద‌రాబాద్ లో లాంచ్ చేశారు. ఈ పాట‌ను ర‌ఘు కుంచె స్వ‌ర‌ప‌ర‌చ‌గా బండి స‌త్యం సాహిత్యాన్ని స‌మ‌కూర్చారు. మంగ్లీ ఆల‌పించ‌గా శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశారు.

హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ…“ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వ‌స్తోంది. నేను తెలుగులో చేసిన సినిమాల‌న్నీ కూడా ప‌ర్ఫార్మెన్స్ కి స్కోపున్న చిత్రాలే . అదే కోవ‌లో ఈ సినిమాలో కూడా న‌ట‌ను ప్రాధాన్య‌త ఉన్న పాత్ర చేశాను. అలాగే ఇందులో పాట‌కు శేఖ‌ర్ మాస్ట‌ర్ గారు మంచి స్టెప్స్ కూడా నాతో వేయించారు. క‌రోనా టైమ్ లో స్టార్ట్ చేసి క‌రోనా టైమ్ లో రిలీజ్ కి రెడీ అవుతోన్న మొద‌టి సినిమా మాది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. డైర‌క్ట‌ర్స్ ఎక్స్ లెంట్ గా డీల్ చేశారు. అంద‌రికీ న‌చ్చే సినిమా అవుతుంది“ అన్నారు.

దర్శకుడు విప్రా మాట్లాడుతూ.. “ఇలాంటి సంక్లిష్ట స‌మ‌యంలో సినిమా చేయ‌డ‌మ‌నేది ఎంతో రిస్క్ తో కూడుకున్న‌ది. మా నిర్మాత స‌హ‌కారం వ‌ల్లే ఇది చేయ‌గ‌లిగాం. మా టీమ్ అంతా కూడా ఎంతో స‌హ‌కరించారు. ముఖ్యంగా ఆదాశ‌ర్మ‌గారి స‌పోర్ట్ మ‌రువ‌లేము. క‌రోనా జాగ్ర‌త్త‌లు తీసుకుని సినిమా చేశాం. ఎక్క‌డా ఎలాంటి స‌మ‌స్య రాకుండా సినిమా పూర్తి చేశాం. ఇక మొద‌ట ఇందులో ఒక పాట పెట్టాల‌నుకున్న‌ప్పుడు ఎలాంటి పాటైతే బావుంటుంద‌ని అంతా ఆలోచించాం. ర‌ఘు కుంచెం గారు మంచి పాటిచ్చారు. శేఖ‌ర్ మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ తో నెక్ట్స్ లెవ‌ల్ కు తీసుకెళ్లారు“ అన్నారు. ఇంకా ఇలాంటి మరిన్ని మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..






మరింత సమాచారం తెలుసుకోండి: