ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. స్టార్ హీరోగా రాణిస్తున్నప్పటికీ.. కమర్షియల్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూనే మరోపక్క.. ప్రయోగాత్మక చిత్రాల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఏడాది ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్న బన్నీ… ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. బన్నీ కెరీర్లో చెప్పుకోదగిన పాత్రల్లో… కాదు కాదు మర్చిపోలేని పాత్రల్లో గోన గన్నారెడ్డి పాత్ర కచ్చితంగా ముందుంటుంది.‘రుద్రమదేవి’ చిత్రంలో కీలక భాగమైన ఈ పాత్రకి అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడు. బందిపోటుగా ఇమిడిపోయి నటించడం అతనికి మాత్రమే సాధ్యమయ్యింది.

మళ్ళీ ఈ పాత్రను మరో హీరో చేసినా.. జనాలు యాక్సెప్ట్ చేస్తారు అనే గ్యారెంటీ లేదు. అంతలా బన్నీ ఆ పాత్రకు ప్రాణం పోసాడు. అయితే ఇలాంటి పాత్రను ఎవ్వరూ ఊహించని హీరో బాలయ్య చెయ్యాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇప్పటికే ఆ పాత్ర పై రీసెర్చ్ చెయ్యడం కోసం ప్రత్యేకంగా ఓ టీంను కూడా నియమించాడని తెలుస్తుంది. అయితే ఈ నిర్ణయం పై బాలయ్య మీద నెటిజనుల నుంచి విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది.ఈ పాత్ర పై బాలయ్య అంత ఇంట్రెస్ట్ పెంచుకోవడానికి గల కారణాలు ఏంటి అనే డిస్కషన్లు ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలయ్యాయి. నటుడు అన్నాక.. అన్ని రకాల పాత్రలు చెయ్యాలని అనుకోవడం సహజం.అలాగే నడుచుకోవాలి కూడా..!

అయితే గోనాగన్నా రెడ్డి పాత్రలో.. అల్లు అర్జున్ దిట్టమైన కండలతో చాలా బలంగా కనిపిస్తాడు. మరి 60ఏళ్ళ వయసులో బాలయ్య సిక్స్- ప్యాక్ వంటివి చెయ్యడం సాధ్యమయ్యే పనేనా.! ఏమయ్యా బాలయ్య ఈ వయసులో నీకు ఈ సాహసాలు ఎందుకయ్యా అని సోషల్ మీడియాలో నెటిజనులు పలు రకాల కామెంట్లతో తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.


మరింత సమాచారం తెలుసుకోండి: