బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ అయ్యిందని చెప్పడానికి ఇది ఒక్క ఎక్సాంపుల్ చాలు. బిగ్ బాస్ ఓ పనికిమాలిన షో.. 15 మందిని ఒక చోట పెట్టి పనిపాటా లేకుండా వారికి టాస్కులు ఇస్తూ వారు కొట్టుకుంటుంటే చూడటం కూడా ఒక షోనా అని అనుకునే వారు లేకపోలేదు. కాని అదే షో అన్ని భాషల్లో కూడా వర్క్ అవుట్ అయ్యింది. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా 13 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ రీసెంట్ గా 14వ సీజన్ కూడా స్టార్ట్ చేసుకుంది. బిగ్ బాస్ హోస్ట్ గా సల్మాన్ ఖాన్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన హోస్ట్ గా చేస్తున్నందుకు వందల కోట్లు రెమ్యునరేషన్ గా ఇస్తున్నారు.

ఇదిలాఉంటే తెలుగు బిగ్ బాస్ ప్రస్తుతం 4వ సీజన్ జరుగుతుంది. సీజన్ 1 ఎన్.టి.ఆర్, సీజన్ 2 నాని హోస్ట్ గా చేయగా సీజన్ 3, సీజన్ 4 నాగ్ హోస్ట్ గా చేస్తున్నారు. ఇక ఈ సీజన్ సక్సెస్ అని చెప్పడానికి బెస్ట్ ఎక్సాంపుల్ ఈ షో ప్రోమోకి యూట్యూబ్ లో వచ్చే వ్యూస్. ప్రతిరోజు షోకి ఓ ఐదారు గంటల ముందు నుండి కొన్ని ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు. ఈ ప్రోమోలు కూడా ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ కలుగచేస్తున్నాయి. అందుకే యూట్యూబ్ లో స్టార్ మా ఛానెల్ బిగ్ బాస్ ప్రోమోలకు కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.

ఇదో రకంగా బిగ్ బాస్ మీద ప్రేక్షకుల ఆసక్తిని తెలియచేస్తుందని చెప్పొచ్చు. తెలుగులో బిగ్ బాస్ అన్ని సీజన్లు సక్సెస్ అయ్యాయని తెలుస్తుంది. సీజన్ 4 నాగ్ హోస్ట్ గా మరింత క్రేజ్ తెచ్చుకుంది. ప్రతి వారాంతరం నాగ్ వచ్చి చేసే హుశారైన యాంకరింగ్ షోకి మరింత జోష్ తెస్తుంది. 60 ప్లస్ ఏజ్ లో నాగ్ బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: