మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరియర్ ఫుల్ జోష్ లో ఉంది. లాస్ట్ ఇయర్ ఎఫ్-2, గద్దలకొండ గణేష్ సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న వరుణ్ తేజ్ తన నెక్స్ట్ సినిమా బాక్సర్ గా వస్తున్నాడు. సినిమాలో బాక్సర్ గా కనిపిస్తున్న వరుణ్ తేజ్ అందుకోసం బాక్సింగ్ నేర్చుకున్నాడని తెలుస్తుంది. కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇదిలాఉంటే తన సోషల్ ఫ్లాట్ ఫాం ద్వారా గద్దలకొండ గణేష్ ఫోటో పెట్టి ఆ గన్, గడ్డం మిస్ అవుతున్నా అంటున్నాడు వరుణ్ తేజ్.

మెగా హీరోకి గన్, గడ్డం రెండు ఎంతో బాగా కుదిరాయి. గద్దలకొండ గణేష్ లో ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు వరుణ్ తేజ్. సినిమా చూసిన తర్వాత కుర్రాడిలో విషయం ఈ రేంజ్ లో ఉందా అన్న ఆలోచన వచ్చింది. ఇన్ స్టాగ్రాం లో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ లో గన్ పెట్టుకుని ఉన్న పిక్ షేర్ చేస్తూ గన్, గడ్డం రెండూ మిస్ అవుతున్నా అని కామెంట్ పెట్టాడు. వరుణ్ తేజ్ అది పెట్టడానికి గల కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.

రొటీన్ సినిమాలకు భిన్నంగా ప్రయోగాలు చేస్తూ వస్తున్నాడు వరుణ్ తేజ్. తప్పకుండా మెగా హీరోల్లో అతనికి మంచి ఫ్యూచర్ ఉందని అనిపిస్తుంది. అఫ్కోర్స్ మిగతా మెగా హీరోలు కూడా సూపర్ హిట్లతో దూసుకెళ్తున్నారు. ఏది ఏమైనా మెగా బ్రదర్ నాగబాబు కొడుకుగా వరుణ్ తేజ్ కెరియర్ లో సక్సెస్ అయ్యాడని మాత్రం చెప్పొచ్చు. బాక్సర్ తర్వాత ఎఫ్-3కి సైన్ చేసిన వరుణ్ తేజ్ మరో రెండు సినిమాలు లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.            


 

మరింత సమాచారం తెలుసుకోండి: