అర్జున్ రెడ్డి సినిమాతో క్రేజ్ పెంచుకొని క్రేజీ స్టార్ గా మారారు హీరో విజయ్ దేవరకొండ. టాలెంట్ కి అదృష్టం తోడైతే ఇక ఆ వ్యక్తికి తిరుగు లేదన్నమాట, ఈ సూపర్ యంగ్ అండ్ డైనమిక్ హీరో కి సరిగ్గా సూట్ అవుతుంది. టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకొని ఓ పక్క వరుస సినిమాలతో బిజీ గా ఉంటూనే మరోవైపు సినిమా ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా ఇరువైపులా ఫుల్ బిజీ గా ఉన్న విజయ్ ఇప్పుడు మరో కొత్త బిజినెస్ లోకి దిగాడు. ఇలా అన్ని విధాల తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ యువ హీరో. ఇంతకీ ఆ కొత్త బిజినెస్ ఏమిటంటే ...హైదరాబాద్ కు చెందిన 'వాట్స్ అండ్ వోల్ట్స్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్' కంపెనీలో భాగస్వామిగా చేరి పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యాడు విజయ్.

ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్స్ - స్కూటర్లను నగరవాసులకు బాడుగకు అందుబాటులో ఉంచుతుంది. శుక్రవారం నాడు తెలంగాణా స్టేట్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికిల్ సమ్మిట్ లో వాట్స్ అండ్ వోల్ట్స్ కంపెనీ ప్రతినిధులు మరియు విజయ్ దేవరకొండ తదితరులు ఈ కార్యక్రమంలో లో పాల్గొని పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. ఎలక్ట్రిక్ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని పేర్కొన్నారు.

ఈ కంపెనీ అందించే వాహనాలకు ప్రయాణించే దూరాన్ని బట్టి రెంట్ చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ఈ ఎలక్ట్రికల్ వాహనాల వలన  కాలుష్యం తగ్గడంతో పాటు సమయం మరియు డబ్బు ఆదా అవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ వంటి భారీ జనాభా ఉన్న అభివృద్ధి చెందుతున్న నగరాలలో..  ప్రజలకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు అవసరమైనప్పుడు ఈ వాహనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు . ఈ సేవలు త్వరలోనే జంట నగరాల్లో ప్రారంభమవుతాయని తెలుస్తోంది.... ఇలా మన విజయ్ దేవరకొండ మరో కొత్త బిజినెస్ తో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తనేంటో తెలియజేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: