రాజీవ్ కనకాల దివంగత తల్లిదండ్రులు కూడా ప్రముఖ సినీనటులు అనే విషయం తెలిసిందే. అంతే కాదు యాక్టింగ్ స్కూల్ ను స్థాపించి ఎందరినో నటులుగా తీర్చిదిద్దారు. అలాంటి కుటుంబం నుంచి ఇప్పుడు మూడో తరం సినీ పరిశ్రమలో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. స్టార్స్ తమ వారసులను సినిమాల్లోకి తీసుకురావడంతో కష్టపడి పైకి వచ్చే వారి టాలెంట్ ను తొక్కేస్తున్నారని చాలా మంది చెప్పుకొస్తున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ మరణం తర్వాత నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. టాలీవుడ్ లోకూడా వారసులు వస్తూనే ఉన్నారు. మెగాఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు ఎంట్రీ ఇచ్చారు.

ఇక నందమూరి, అక్కినేని, మంచు, ఘట్టమనేని, దగ్గుబాటి లా చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. వీరితో పాటు కష్టపడి పైకి వచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. టాలీవుడ్ లో టాలెంట్ లేనిదే ప్రేక్షకులు ఆదరించరని చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మరో వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. గతంలో హీరోగా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాలను హీరోగా వెండితెరకు పరిచయం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే రాజీవ్ కనకాల సతీమణి సుమ తెలుగు టాప్ యాంకర్ అన్న విషయం తెలిసిందే. రోషన్ గతంలో శ్రీకాంత్ తనయుడు నటించిన 'నిర్మలా కాన్వెంట్' చిత్రంలో నటించాడు. కొత్త దర్శకుడు విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రాన్ని రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. మరి రోషన్ ఎంత వరకు తనను తాను ప్రూవ్ చేసుకుంటాడో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: