‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ తరువాత త్రివిక్రమ్ పేరు చెపితే చాలు పవన్ అభిమానులు ఉలిక్కి పడుతున్నారు. ‘అజ్ఞాతవాసి’ లాంటి సత్తా లేని కథను ఏ ధైర్యంతో పవన్ కోసం త్రివిక్రమ్ క్రియేట్ చేసాడు అంటూ గతంలో త్రివిక్రమ్ పై చాల ఎక్కువగా పవన్ అభిమానుల మాటల దాడి కొనసాగింది ఇప్పుడు మళ్ళీ పవన్ అభిమానుల మధ్య త్రివిక్రమ్ టార్గెట్ అవుతున్నాడు.


పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీగా ‘వకీల్ సాబ్’ రూపు దిద్దు కోవడం వాస్తవానికి పవన్ అభిమానులకు ఎవరికీ పెద్దగా ఇష్టం లేదు. పవన్ బాడీ లాంగ్వేజ్ కీ పవన్ ఇమేజ్ కీ ‘వకీల్ సాబ్’ ఏమాత్రం నప్పదు అన్నది అభిమానుల స్థిర అభిప్రాయం. వాస్తవానికి ‘పింక్’ రీమేక్ విషయంలో పవన్ కళ్యాణ్ ను బలవంత పెట్టి ఒప్పించింది త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్న కోపం పవన్ అభిమానులకు త్రివిక్రమ్ పై ఉంది.


ఇప్పుడు ఈ కోపం కొనసాగుతూ ఉండగానే పవన్ ‘అయ్యప్పన్ కోషియమ్‍’ రీమేక్‍ లో నటించే విషయంలో మళ్ళీ ప్రభావితం చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహా అని వార్తలు వస్తూ ఉండటంతో పవన్ అభిమానుల అసహనానికి హద్దులు లేకుండా పోతోంది. పవన్‍ స్క్రీన్‍ ఇమేజ్‍ కి అతని యాక్టింగ్‍ స్టయిల్‍  కి ఆ కథ ఆ పాత్ర సూట్‍ అవ్వదని ఫ్యాన్స్ కి బాగా తెలుసు. వాస్తవానికి తమకు పవన్ ఎలాంటి సినిమాలలో నటిస్తే బాగుంటుందో తెలిసినప్పుడు పవర్ స్టార్ తో అంతగా ట్రావెల్‍ చేసిన త్రివిక్రమ్‍ కు ఈమూవీ రీమేక్ నప్పదు అని త్రివిక్రమ్ కు ఎందుకు తెలియలేదు అంటూ అభిమానులు త్రివిక్రమ్ కు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు.


ఈ పరిస్థితులు ఇలా ఉండగా ‘అయ్యప్పన్ కోషియమ్’ రీమేక్ కు సంబంధించి పవన్ కేవలం 25 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చి రోజుకు కోటిన్నర పారితోషికాన్ని తీసుకుంటున్నట్లు టాక్. ఈమూవీ షూటింగ్ జనవరి నెలాఖరులో మొదలుపెట్టి చాల వేగంగా పూర్తి చేస్తారు అని అంటున్నారు. మళయాళ ఫిలిం ఇండస్ట్రీలో 150 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించిన ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవుతుందని పవన్ త్రివిక్రమ్ లు నమ్ముతుంటే త్రివిక్రమ్ నమ్మకం పై పవన్ అభిమానులకు ఎటువంటి విశ్వాసం లేకపోవడం షాక్ ఇచ్చే విషయం..

మరింత సమాచారం తెలుసుకోండి: