తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించింది ఈ భామ. తన అంద చెందాలతో మెప్పిస్తూ తెలుగు ప్రేక్షుకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే కొందరు హీరోయిన్స్ కు స్టార్ హీరోల సరసన నటించినా.. పెద్ద సినిమాల్లో నటించినా కూడా బ్రేక్ రాదు. ఉన్నట్లే ఉంటారు కనిపించకుండా పోతారు. అలాంటి ఒక హీరోయిన్ ప్రణీత సుభాష్.

ఈమె టాలీవుడ్ లో పవన్, ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోల సినిమాల్లో నటించింది. కాని ఆమెకు అదృష్టం కలిసి రాకపోవడం వల్లో లేక మరేంటో కాని కంటిన్యూగా ఈమెకు ఆఫర్లు రాకుండా పోయాయి. ఆ తర్వాత రామ్ నటించిన ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాలో నటించిన ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ సైడ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు అవకాశాలు రాకపోవడంతో మెల్లగా ఈమె కెరీర్ ఫేడ్ ఔట్ అయ్యింది. తెలుగులో ఆఫర్లు రాని సమయంలో ఇతర భాషల్లో ప్రయత్నించి ఒక్కింత సక్సెస్ దక్కించుకుంది. తెలుగులో మళ్లీ అవకాశం ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న ఈ అమ్మడు సాధ్యం అయినంత వరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు.. వార్తల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

తాజాగా ఈమె లాక్ డౌన్ టైమ్ లో హార్స్ రైడింగ్ నేర్చుకుంది. ఈ విషయం ఆమె తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఫొటో షేర్ చేసింది. ఉన్నట్లుండి హార్స్ రైడింగ్ ఎందుకు అంటూ పలువురు నెటిజన్స్ ఆమెను ప్రశ్నించారు. ఏదైనా సినిమాలో పాత్ర కోసం మీరు హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నారా అంటూ ఎక్కువ మంది ప్రశ్నించడంతో కేవలం ఫిట్ నెస్ కోసమే హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను అంటూ చెప్పింది. అదేంటి ఫిట్ నెస్ కోసం ఎవరైనా హార్స్ రైడింగ్ నేర్చుకుంటారా ఫన్నీగా ఉంది మీ సమాధానం అంటూ నెటిజన్స్ ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు.​​​​​

మరింత సమాచారం తెలుసుకోండి: