ప్రస్తుతం బిగ్బాస్ తెలుగు సీజన్ ఫోర్ బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే. మొదట ఎవరికీ అంతగా తెలియని సెలబ్రిటీలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ సారి బిగ్ బాస్ హౌస్ అంతలా అలరించదు  అని అందరూ అనుకున్నారు  కానీ బిగ్బాస్ కెమెరాలు హౌస్ లోని ట్రయాంగిల్ లవ్ స్టోరీ లు.. అంతేకాకుండా కాంట్రవర్సీ లను ఎక్కువగా ఫోకస్ చేసి చూపించడంతో బిగ్బాస్ తెలుగు సీజన్ 4 ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది. ముఖ్యంగా ఈ షోలో ప్రతివారం పోస్ట్ గా వచ్చే నాగార్జున సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారుతున్న విషయం తెల్సిందే. తన వాక్చాతుర్యంతో ప్రతి వారం బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటస్టెంట్స్ అందరితో ఎన్నో ఫన్నీ టాస్క్ లు చేయిస్తూ ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న విషయం తెలిసిందే.



 అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లు  ఏమాత్రం రెచ్చిపోయి మాట్లాడిన వారందరికీ వార్నింగులు కూడా ఇస్తున్నాడు నాగార్జున. గత వారం వైల్డ్ డాగ్ షూటింగ్ నేపథ్యంలో విదేశాలకు వెళ్లడంతో నాగార్జున స్థానంలో బిగ్ బాస్ హోస్ట్ గా అక్కినేని వారి కోడలు సమంత ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇక సమంత రావడంతో బిగ్ బాస్ హౌస్ కి ఒక్కసారిగా టాప్ రేటింగ్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సమంత తన వాక్చాతుర్యంతో బిగ్ బాస్ హోస్ట్ గా అందరినీ మెప్పించిన విషయం తెలిసిందే. ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ గా ఎవరు రాబోతున్నారు అన్నదానిపై ఆసక్తికర చర్చ మొదలైంది.



 మళ్లీ అక్కినేని వారి కోడలు సమంత బిగ్ బాస్ హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతుందా  లేదా నాగార్జున హోస్ట్  గా రాబోతున్నాడా  అన్నదానిపై ఆసక్తికర చర్చ మొదలయింది. అయితే నాగార్జున షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లి ఇంకా తిరిగి రాని నేపథ్యంలో మళ్లీ ఈ వారం కూడా అక్కినేని వారి కోడలు సమంత బిగ్ బాస్ షోకు హోస్ట్గా వస్తుంది అని టాక్ వినిపించింది. కానీ ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వస్తున్నాడు అన్నది ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది. ఈ వారం బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున ఎంట్రీ ఇచ్చి మరోసారి అలరించబోతున్నట్లు  తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: