దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా సినిమా థియేటర్స్ మూతపడిన సంగతి అందరికి తెలిసిందే. కొత్త సినిమాలను ఓటిటి ద్వారా విడుదల చేస్తున్నారు. దీంతో ఓటీటీకి డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఓటిటి కారణంగా థియేటర్స్ ఓపెన్ చేసిన జనాలు సినిమా హాల్స్ కి వస్తారా.. రారా అనే సందేహాలు దర్శకులను వెంటాడుతున్నాయి. అయితే థియేటర్స్ ఓనర్స్ మాత్రం డిసెంబర్ నుంచి ఓపెన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అయితే జనాల్ని థియేటర్స్ కి రప్పించడం కోసం రవితేజ ఓ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఈ సంక్రాంతికి ముందుగా థియేటర్లలోకి వచ్చే సినిమా రవితేజ క్రాక్. ఈ చిత్రానికి మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలి చిత్ర బృందం అనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే జనవరి 7 లేదా 8న ఈ సినిమా థియేటర్లలో ప్రత్యక్షమయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే కరోనా వల్ల థియేటర్లు అన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినా చాలా చోట్ల తెరుచుకోలేదు.

అందుచేత జనాల్ని సినిమా హాల్స్ కి రప్పించడం కోసం రవితేజ తన సినిమా ప్రచారం కోసం తెలుగు రాష్ట్రాల్లోని మెయిన్ సెంటర్లలో పర్యటించాలని నిర్ణయించుకున్నాడట. ప్రమోషన్స్ కోసమని ఏదో చిన్న ఇంటర్ వ్యూ ఇచ్చి చేతులు దులుపుకోకుండా.. ఇలా ప్రచారం చేయడం మంచిదే అని సినీ ప్రముఖులు అనుకుంటున్నారు. మిగిలిన హీరోలు కూడా ఇలా చేస్తే... మళ్లీ జనాలు థియేటర్స్ కి రావడం ఖాయం అని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: