అది ఏంటి ఏరికోరి మరీ నందమూరి హీరో ఎన్టీఆర్ అలానే మెగా హీరో రామ్ చరణ్ తేజ్ ని ఆర్.ఆర్.ఆర్ కోసం తీసుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు తలనొప్పిగా మారటం ఏంటి అనుకుంటున్నారా ? తప్పు లేదు లెండి మీకు అనుమానం రావడంలో అసలు ఏమాత్రం తప్పు లేదు. కాని విషయం ఏంటంటే తల నొప్పులు ఆ ఇద్దరు హీరోల వలన కాదు ఆ ఇద్దరు హీరోల అభిమానుల వల్ల. అభిమానులు అంటే మళ్ళీ అందరూ కాదండోయ్ అందులో కొందరు దురభిమానులు వలన మాత్రమే. విషయం ఏంటంటే దర్శక ధీరుడు రాజమౌళి రామ్ చరణ్ తేజ, ఎన్టీఆర్ లను కలిపి ఓ సినిమా తీస్తున్నాడు.

ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా ఎన్టీఆర్ కూడా మంచి పవర్ఫుల్ రోల్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఇక్కడ బాగానే ఉంది. కానీ ఈ ఇద్దరు ఎలివేషన్స్ విషయంలో మాత్రం ఇద్దరు ఫాన్స్ మధ్య గొడవ మొదలైంది. అది సోషల్ మీడియాలో ఉన్న కొద్దీ ఉధృతమవుతోంది. ఒక హీరో అభిమానులు మరో హీరోని మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ల వరకు వాళ్లు తమ హీరోని డిఫెండ్ చేసుకుంటున్నాము అనుకుంటున్నారు కానీ ఇక్కడ అసలు విషయానికి వస్తే అది ఆర్.ఆర్.ఆర్ కి దెబ్బ అవుతోంది.

అందుకే ఈ ఇద్దరు హీరోలు రాజమౌళి తలనొప్పిగా మారాయి. ఒక పెద్ద హీరో అలానే ఒక అప్ కమింగ్ హీరోని పెట్టి సినిమా తీసి ఉంటే ఎలా ఉండేదో కానీ ప్రస్తుతం ఉన్న ఇద్దరూ స్టార్ హీరోలు కావడం ఇద్దరు ఫ్యామిలీలకి పెద్ద సినిమా బ్యాగ్రౌండ్ ఉండడం రాజమౌళికి తలనొప్పి తెచ్చిపెట్టింది. సినిమా షూటింగ్లో ఉండగానే ఇలా ఉంటే ఒక వేళ రిలీజ్ కి దగ్గర పడితే ఇంకా పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నాడట రాజమౌళి. ఎవరెన్ని టెన్షన్స్ పెడితే మాకెందుకు మేము మాత్రం అనుకున్నది చేసి తీరతామని ఫాన్స్ ట్రోలింగ్ చేసే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: