లేటెస్ట్ గా కేంద్రప్రభుత్వం అన్ లాక్ డౌన్ కు సంబంధించి విడుదల చేసిన మార్గదర్శకాలలో ఫిలిం ఇండస్ట్రీకి ఏమాత్రం కలిసి వచ్చే అంశాలు లేకపోవడంతో వచ్చేనెల రాబోతున్న దీపావళి పై కూడ ఇండస్ట్రీ వర్గాలు ఆశలు వదులుకున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో అక్కడక్కడ కొన్ని ధియేటర్లు ఓపెన్ చేసినా జనం పట్టించుకోకపోవడంతో కలక్షన్స్ లేవు.


దీనికితోడు రిలీజ్ రెడీగా ఉన్న క్రేజీ సినిమాలు ఏమి లేవు. ఇక మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొన్ని జిల్లాలలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు వార్తలు వస్తున్నా ఆవార్తలను పూర్తిగా జనం నమ్మలేకపోతున్నారు. దీనికితోడు ఇప్పటికీ మధ్య తరగతి ఎగువ మధ్యతరగతికి చెందిన వారిలో ఇంకా కరోనా భయాలు పూర్తిగా పోలేదు. ఇక సినిమాలకు సంబంధించి మిగిలింది క్రిస్మస్ సీజన్ మాత్రమే అని అంటున్నారు.


సెంటిమెంట్ రీత్యా గతంలో కొన్ని సినిమాలు మినహా డిసెంబర్ లో విడుదలైన చాల సినిమాలు ఫెయిల్ అయ్యాయి. దీనికితోడు తెలుగు ప్రజలకు క్రిస్మస్ పెద్ద పండుగ కాదు. ఇలాంటి పరిస్థితులలో ఇక అందరి దృష్టి సంక్రాంతి పైనే ఉంది. ‘రెడ్’ ‘రంగ్ దే’ ‘వకీల్ సాబ్’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ ‘క్రాక్’ ‘ఉప్పెన’ సినిమాలతో పాటు ఇంకా చాల సినిమాలు లైన్ లో ఉన్నాయి. అయితే సంక్రాంతి సీజన్ కు ఒకేసారి ఇన్ని సినిమాలు విడుదల అయితే ఇప్పటికే సినిమాలు చూసే అలవాటు పోయిన ప్రేక్షకులు గతంలో లా సంక్రాంతికి మూడు నాలుగు సినిమాలు చూసే అలవాటు కొనసాగిస్తారా అన్న సందేహాలు కూడ కొనసాగుతున్నాయి.


అంతేకాదు సంక్రాంతి సీజన్ కు అయినా నూటికి నూరు శాతం సీట్ల ఆక్యుపెన్సీ తో షోలను వేసుకునే అనుమతులు లేకపోతే సంక్రాంతి సీజన్ కు కూడ డుమ్మా కొట్టే ఆలోచనలు ఉన్నాయి. అయితే ఈ ఆలోచనలు అన్నింటిని ప్రభావితం చేసే కీలక శక్తి కరోనా సెకండ్ వేవ్. ఈ వేవ్ భారత్ లో రాకుంటే ఇండస్ట్రీ బతుకుతుందనీ లేకుంటే పరిస్థితులు మరింత క్షీణించి ధియేటర్లు శాస్వితంగా మూత పరిస్థితులు ఏర్పడతాయి అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడుతున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: