ఏ స్టేజ్ చూసిన ఈ పాటే..... ఎవరి  నోట విన్న ఇదే... అంతలా ఫేమస్ అయిపోయింది ఈ  ''నీ పక్కన పడ్డాదో లేదో సూడవె పిల్లా నాదీ నక్కిలీసు గొలుసు''. ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఈ పాట పలాస అనే సినిమా లోనిది. ఇలా ఈ పాట  రియలిస్టిక్ అప్రోచ్ తో ఉండదా వల్ల అందర్నీ ఆకట్టేసుకుంది. పలాస డైరెక్టర్ కొత్త వారైనా  సినిమా మేకింగ్ తో ఫిదా చేశాడు అనే చెప్పాలి.  కరుణ కుమార్  కథ, కథనం, డైలాగ్స్ తో ఇంప్రెస్ చేశాడు.  పలాస లాంటి సినిమా తరవాత ఈ దర్శకుడు ఇప్పుడు  మాస్ సినిమా తో రానున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటించనున్నాడు. టైటిల్ వచ్చేసి... శ్రీదేవి సోడా సెంటర్.   కరుణ కుమార్ దర్శకత్వం లో రానున్న ఈ సినిమా  షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ సినిమా  పోస్టర్ కూడా బాగా ఆకట్టుకుంది. మరో పలాస వస్తుందని..... నక్కిలీసు గొలుసు ని మించి పోయే సాంగ్ ఉంటుందని అంటున్నారు ప్రేక్షకులు. 

ఈసారి మణిశర్మశ్రీదేవి సోడా సెంటర్ కి మ్యూజిక్ ఇస్తున్నాడు. భలే మంచి రోజు నిర్మాతలే ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్టార్ ఫ్యామిలీ కుర్రాడైనా.. ఆ స్టార్ డమ్ ల జోలికి పోకుండా.. సింపుల్ మూవీస్ ని టచ్ చేస్తూ.... సింపుల్ గా మంచి మంచి సినిమాలే తీస్తున్నాడు సుధీర్ బాబు ఈ సినిమాలో కూడా మంచిగ ఆకట్టుకుంటాడు.  శ్రీదేవి సోడా సెంటర్ కూడా  మంచి మూవీ అవుతుంది. హిట్టు కూడా గ్యారంటీ అనే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. మరి సినిమాని చూడాలంటే ఆగాల్సిందే.


  

మరింత సమాచారం తెలుసుకోండి: