బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో గంగవ్వ తర్వాత అనారోగ్యం కారణంగా నోయల్ ఇంటికి వెళ్ళిపోయారు. కీళ్లవాపు వ్యాధితో బాధ పడుతున్న సింగర్ నోయల్ సేన్ గత కొంతకాలంగా హౌస్ లో నడవలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫిజికల్ టాస్క్ లలో కూడా ఆడ లేక పోతున్నారు. దీనికి కారణం అతనే అనారోగ్యమైనని ఇటీవలే ప్రేక్షకులకి తెలిసొచ్చింది. దీంతో అతడిపై జాలిపడిన ప్రేక్షకులందరూ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు.


అయితే నోయల్ హౌస్ నుండి బయటకు వచ్చి రెండు రోజులవుతోంది. శారీరక నొప్పులు తగ్గగానే నోయెల్ మళ్ళీ హౌస్ లో అరంగేట్రం చేయొచ్చని బిగ్ బాస్ వెల్లడించారు. బిగ్ బాస్ సీజన్ 4 ఇంకా 45 రోజుల పాటు కొనసాగనుంది. కానీ నోయెల్ సేన్ రెండు మూడు వారాల్లో కోరుకో గలిగితే హౌస్ లో రీ ఎంట్రీ ఇవ్వగలుగుతారు. లేకపోతే అతని పై ఆశలు వదిలేసుకోవాలి అని టీవీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే నోయెల్  ఆరోగ్య పరిస్థితి గురించి ఒక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే నోయెల్ ఇప్పటికే ఆసుపత్రిలో జాయిన్ అయి మెరుగైన చికిత్స పొందుతున్నారట. రెండు వారాల్లోనే పూర్తిగా కోలుకొని హౌజులో అరంగేట్రం చేయనున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.


బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మండా మాట్లాడుతూ.. నోయెల్ ఈసారి టాప్ 5 కంటెస్టెంట్లలో ఉచితంగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు కూడా అదే అనుకున్నారు కానీ అనుకోని విధంగా ఆయనకు ఆర్థరైటిస్ జబ్బు తీవ్రతరం కావడంతో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. గంగవ్వ కూడా ఆరోగ్యం కారణం తో బయటకు వెళ్లారు. జబర్దస్త్ అవినాష్ కాలు పెరగడంతో ఆయన కూడా కొన్ని రోజులు చికిత్స పొందాడు. ఈ విధంగా ఈసారి హౌస్ లో అరంగేట్రం చేసిన ఇంటి సభ్యులు అనారోగ్యం పాలవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: