శ్రీదేవి రజినీకాంత్ కి తల్లిగానా ఈ కాంబినేషన్ ఏంటి బాగాలేదు అని అనుకోకండి.. కొన్నిసార్లు ఇటువంటి కాంబినేషన్ తెరపై చూడవలసిందే తప్పదు .. శ్రీదేవి గారు  అతి తక్కువ సమయం లోనే అగ్ర కథానాయకులతో నటించింది.. టాలీవుడ్ లో ఈమె మొదటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ,శోభన్ బాబు వంటి వారితో నటించింది. అంతేకాదు నిన్నటి తరం స్టార్ హీరోలైన చిరంజీవి, వెంక‌టేష్, నాగార్జున వంటి వారి సినిమాల్లో కూడా నటించింది. కొన్ని దశాబ్దాలపాటు సినీ ఇండస్ట్రీ లో శ్రీదేవి యుగం నడిచింది అనే విష్యం చెప్పక మానదు .. తన నటనతో ఎంతో మందికి అభిమాన నటిగా కూడా శ్రీదేవి మారింది ..

తనదైన అందం, నటనతో తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి  తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తోనూ ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు . ఈ క్రమంలోనే ఓ సినిమాలో రజినీకి సవతి తల్లిగా శ్రీదేవి నటించింది. అదీ 13ఏళ్ల వయసులోనే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

కె.‌బాల‌చం‌దర్‌ తెర‌కె‌క్కిం‌చిన ‌మూండ్రు ముడిచ్చు.. అనే తమిళ్ సినిమా  1976లో విడుదలైంది. ఇందులో కమల్‌హాసన్, రజినీకాంత్ స్నేహితులు గా చేసారు ఇందులో శ్రీదేవిని ఇద్దరూ ప్రేమించగా ఆమె మాత్రం కమల్‌ను ఇష్టపడుతుంది. ఈ క్రమంలోనే కమల్ చనిపోగా.. దానికి కారణం రజినీయే అని ఆమె భావిస్తుంది. దీంతో అతడిపై పగ తీర్చుకునేందుకు రజినీ తండ్రిని పెళ్లి చేసుకుని సవతి తల్లిగా మారుతుంది... ఆలా ఆ సినిమా ద్వారా శ్రీదేవి రజినీకాంత్ కి తల్లిగా నటించారు..

శ్రీదేవి గారిని రజినీకాంత్ కి తల్లిగా చూపించడమంటే దర్శకుడు పెద్ద సాహసమే చేసారని చెప్పాలి  .. అంతే కాదు శ్రీదేవి గారు కూడా రజినీకాంత్ కి తల్లిగా చేయడానికి ఒప్పుకోవడం కూడా పెద్ద సాహసమే చెప్పాలి .. అప్పట్లో అయితే ఒప్పుకున్నారు కానీ ఇప్పటి రోజుల్లో చేస్తే మాత్రం అభిమానులు అస్సలు ఒప్పుకోరు ..


మరింత సమాచారం తెలుసుకోండి: